365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బిజినెస్ డెస్క్, హైదరాబాద్ జనవరి 20,2026: దేశీయ కోలా దిగ్గజం ‘థమ్స్ అప్’ తన బ్రాండ్ ఇమేజ్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత బ్రాండ్ లోగోలో భారీ మార్పులు చేస్తూ ‘నూతన విజువల్ ఐడెంటిటీ’ని మంగళవారం విడుదల చేసింది.

Read This also.. ASME EFx India 2026 Concludes, Showcasing Emerging Engineering Talent from Across India

ఇదీ చదవండి..ఢిల్లీ, గౌహతిల్లో కోక్ స్టూడియో భారత్ లైవ్ మ్యాజిక్.. శ్రేయా ఘోషల్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేజ్!

Read this also..Rashmika Mandanna Stars in Signify’s New ‘Fans Reimagined’ Campaign..

యువ భారత్ ఆకాంక్షలు, సాహసోపేత నిర్ణయాలు, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఈ రీబ్రాండింగ్‌ను చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.

ఆధునిక హంగులతో.. థమ్స్ అప్ ఇన్-హౌస్ డిజైన్ టీమ్, ప్రముఖ డిజైన్ ఏజెన్సీ ‘సూపర్ అల్ట్రా రేర్’ భాగస్వామ్యంతో ఈ కొత్త రూపురేఖలను తీర్చిదిద్దింది. బ్రాండ్ వారసత్వాన్ని కాపాడుకుంటూనే, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లపై స్పష్టంగా కనిపించేలా లోగోను ఆప్టిమైజ్ చేశారు. టైపోగ్రఫీని మరింత పదునుగా మార్చారు.

డైనమిక్ మార్పులు..

కలర్ పాలెట్ ఇదే.. బ్రాండ్ పాత వైభవాన్ని స్ఫురింపజేస్తూనే.. స్పైస్డ్ రెడ్, ఐస్డ్ బ్లూ, స్టార్మ్ బ్లూ అనే మూడు రంగుల సమ్మేళనాన్ని కొత్త లోగోలో వాడారు. ఇది శక్తిని, రిఫ్రెష్‌మెంట్‌ను, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఐకానిక్ ‘బొటనవేలు’ గుర్తులో మానవ స్పర్శ ఉట్టిపడేలా డైనమిక్ మార్పులు చేశారు.

తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా.. కోకాకోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా సీనియర్ డైరెక్టర్ సుమేలి ఛటర్జీ మాట్లాడుతూ.. “దాదాపు ఐదు దశాబ్దాలుగా థమ్స్ అప్ యువత సంస్కృతిలో భాగమైంది.

‘టేస్ట్ ది థండర్’ నినాదంతో తరతరాలను అలరించిన ఈ బ్రాండ్, తదుపరి దశ వృద్ధి కోసం మరింత డైనమిక్ గా మారుతోంది” అని పేర్కొన్నారు. సూపర్ అల్ట్రా రేర్ వ్యవస్థాపకుడు మాథ్యూ కెన్యన్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఇష్టపడే సారాంశాన్ని కాపాడుతూనే, నేటి యువతకు తగ్గట్టుగా బ్రాండ్ గుర్తింపును పదును పెట్టామని వివరించారు.

తూఫానీ ప్రస్థానం..

1977లో స్వదేశీ కోలాగా ప్రస్థానం ప్రారంభించిన థమ్స్ అప్.. #TasteTheThunder, #PalatDe వంటి ప్రచార చిత్రాలతో భారతీయ మార్కెట్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది.

గతేడాది విడుదలైన ‘థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్’ (షుగర్ ఫ్రీ) కేవలం ఆరు నెలల్లోనే అతిపెద్ద నో-షుగర్ పానీయంగా నిలవడం విశేషం. ఇప్పుడు కొత్త లోగోతో మరింత ఉత్సాహంగా వినియోగదారుల ముందుకు రానుంది.