365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 23,2026: నగరంలోని బహిరంగ ప్రదేశాలు, పార్కులు ,రహదారుల ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) తన ఉక్కుపాదం కొనసాగిస్తోంది. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండల పరిధిలోని గోపాల్‌నగర్‌లో కబ్జాకు గురవుతున్న 3300 గజాల పార్కు స్థలాన్ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

1980లో సర్వే నంబర్లు 148 నుంచి 155 వరకు ఉన్న 92.21 ఎకరాల విస్తీర్ణంలో గోపాల్‌నగర్ లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 1200 ప్లాట్లు ఉండగా, నిబంధనల ప్రకారం మూడు చోట్ల పార్కుల కోసం స్థలాలు కేటాయించారు. అయితే, ఇప్పటికే రెండు పార్కు స్థలాలు కబ్జాకు గురవగా, మూడవ పార్కు కూడా ఆక్రమణదారులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించారు.

ఇదీ చదవండి..ఎన్ని రకాల అంబులెన్స్‌లు ఉన్నాయో మీకు తెలుసా..?

ఇదీ చదవండి..అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: సెన్‌హైజర్ ప్రీమియం ఆడియో ఉత్పత్తులపై 50% వరకు భారీ తగ్గింపు..

ఇదీ చదవండి..ఎన్‌ఐఐటి యూనివర్సిటీ: 2026 విద్యా సంవత్సరానికి స్కాలర్ సెర్చ్ ప్రోగ్రామ్ ప్రారంభం..

ఈ విషయంపై గోపాల్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, రెవెన్యూ,జీహెచ్‌ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణలో సదరు స్థలం పార్కుకు చెందినదేనని నిర్ధారణ కావడంతో తక్షణ చర్యలు చేపట్టారు.

పార్కు స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్డును అధికారులు కూల్చివేశారు.

3300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు.

సదరు స్థలం ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేస్తూ అక్కడ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.

“ఏళ్ల తరబడి విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు, కానీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి మా పార్కును కాపాడారు” అని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.