365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 25, 2026: హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పారామం వేదికగా జరుగుతున్న‘గాంధీ శిల్పబజార్’ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాకు చెందిన అద్భుతమైన హస్తకళా రూపాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గోండ్ పెయింటింగ్స్, మెటల్ క్రాఫ్ట్స్, వెదురుతో రూపొందించిన వినూత్న అలంకరణ వస్తువులు కళాప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇంటి అలంకరణకు వినియోగించే వెదురు వస్తువులు, చేనేత వస్త్రాల వద్ద సందర్శకుల సందడి కనిపిస్తోంది.
నృత్య నీరాజనం..

ప్రదర్శనలో భాగంగా సాయంత్రం వేళల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఒడిస్సీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
భక్తి పారవశ్యంలో ఒడిస్సీ..
శ్రీమతి సుస్మిత మిశ్ర శిష్య బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం భక్తిభావాన్ని నింపింది. ‘శుక్లాంబరధరం’ ప్రార్థనతో ప్రారంభించి.. స్థాయి, శ్రీహరి స్తోత్రం, బసంత్ పల్లవి, సంజనిరి, తరంగ్, మొఖ్య వంటి అంశాలను కళాకారిణులు దివ్యశ్రీ, ఆర్వీ, సౌమ్య, ఆద్య, సంప్రీతి, అంకిత, తన్వి తమ అభినయంతో మెప్పించారు.
మురిపించిన కూచిపూడి.. అనంతరం శ్రీమతి నిహారిక చౌదరి శిష్య బృందం కూచిపూడి నృత్యంతో అలరించారు. ‘దంతం భజామి’, బ్రహ్మాంజలి, జతిస్వరం, దశావతార శబ్దం వంటి అంశాలను చిన్నారులు లయబద్ధంగా ప్రదర్శించారు.
ఇదీ చదవండి..గల్ఫ్ దేశాల్లోనే అతిపెద్ద ఫిల్మ్ రిస్టోరేషన్ కేంద్రం ప్రారంభం..
Read this also..Prasad and World Sound & Vision Launch GCC’s Largest Film Restoration Centre in Riyadh..
Read this also..Flipkart Unveils ‘Crafted by Bharat’ Sale for Republic Day..
అన్నమాచార్య కీర్తనలు, శివతాండవ స్తోత్రం, జావళి, ‘కూచిపూడి తల్లికి వందనం’ వంటి ప్రదర్శనల్లో సమన్వి, లాలిత్య, మనస్విని, సృష్టి, శృతి, నిత్య, హిమాన్వి, కైరా, నైనిక తమ ప్రతిభను చాటుకున్నారు.
హస్తకళల కొనుగోలుతో పాటు, భారతీయ శాస్త్రీయ నృత్యాల కలయికతో శిల్పారామం ప్రాంగణం ఒక సాంస్కృతిక పండుగను తలపిస్తోంది.
