365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,జనవరి 28,2026: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘దాదా’గా పిలిచే అజిత్ పవార్ అకాల మరణం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణించిన బాంబార్డియర్ లెయర్ జెట్ 45 విమానం ల్యాండింగ్‌కు ముందు కుప్పకూలడం వెనుక సాంకేతిక లోపమా లేక వాతావరణ ప్రభావమా అన్నది అన్వేషిస్తున్నారు.

అయితే, గణాంకాలను పరిశీలిస్తే పెద్ద కమర్షియల్ విమానాల కంటే చిన్న విమానాలు (జనరల్ ఏవియేషన్) ప్రమాదాలకు గురయ్యే అవకాశం 20 నుంచి 25 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి..ఒత్తిడిని జయించే సరైన సింపుల్ టిప్స్ మీకోసం..!

ఇదీ చదవండి..అజిత్ పవార్ కుటుంబ నేపథ్యం ఇదే..

ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఒక్క పైలట్ – ఎక్కువ ఒత్తిడి: పెద్ద విమానాల్లో ఇద్దరు పైలట్లు, అనేక మంది సిబ్బంది ఉంటారు. చిన్న విమానాల్లో తరచుగా ఒకరే పైలట్ ఉండటం లేదా అనుభవం తక్కువ ఉన్న సిబ్బంది ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.

పెద్ద విమానాలు మేఘాలకు పైన (సుమారు 35,000 అడుగుల ఎత్తులో) ప్రయాణిస్తాయి. కానీ చిన్న విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల వర్షం, పొగమంచు మరియు గాలి మళ్లింపుల (Turbulence) బారిన త్వరగా పడతాయి.

ఇదీ చదవండి..అజిత్ పవార్ విమానం కూలడానికి ముందు పైలట్ చేసిన చివరి హెచ్చరిక ఇదే..

Read this also..“Baramati Learjet Tragedy: 26-Year-Old First Officer Shambhavi Pathak Among Five Victims”

కమర్షియల్ జెట్లలో ఉండే అత్యాధునిక ‘బ్యాకప్’ వ్యవస్థలు, రాడార్ పరిజ్ఞానం చిన్న విమానాల్లో పరిమితంగా ఉంటాయి. ఒక్క ఇంజిన్ ఫెయిల్ అయినా ఈ విమానాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అజిత్ పవార్ ప్రమాదం జరిగిన బారామతి వంటి విమానాశ్రయాల్లో ‘గైడెన్స్ సిస్టమ్స్’ తక్కువగా ఉండటం, పొగమంచు సమయంలో ల్యాండింగ్‌ను అత్యంత ప్రమాదకరంగా మారుస్తుంది.