365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 31,202026: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని శాటిలైట్ పరిజ్ఞానంతో ఖచ్చితంగా లెక్కించే ప్రక్రియను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) విజయవంతంగా పూర్తి చేసింది.

దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేయనున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు.

శనివారం సైఫాబాద్‌లోని కమ్యూనిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

90% ఖచ్చితత్వంతో సాగు వివరాలు
గత ఏడాది విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అడ్వాన్స్‌డ్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ సెంటర్’ ద్వారా ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు.

Read this also..PJTAU to Submit Landmark Satellite-Based Crop Report to Telangana Government on Feb 6..

ఇదీ చదవండి..హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఆభరణాల ప్రదర్శన: పీఎంజే జ్యువెల్స్ అద్భుత ఆవిష్కరణ..

స్విట్జర్లాండ్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ ‘SARMAP’ సహకారంతో, రిమోట్ సెన్సింగ్,జిఐఎస్ (GIS) సాంకేతికతను ఉపయోగించి గ్రామాల్లోని ప్రతి సర్వే నంబర్ వారీగా సాగు విస్తీర్ణాన్ని విశ్లేషించారు.

క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ఈ ఫలితాలను పరిశీలించగా, సుమారు 90 శాతం ఖచ్చితత్వం నమోదైనట్లు ప్రొఫెసర్ జానయ్య తెలిపారు.

తక్కువగా సాగు విస్తీర్ణం: ప్రాథమిక నివేదిక ప్రకారం.. సాగు యోగ్యమైన భూమితో పోలిస్తే, వాస్తవంగా పంటలు వేసిన విస్తీర్ణం సరాసరిగా 8 నుంచి 12 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.

Read this also..15-Year Infertility Battle Ends in Success at Hyderabad’s Birla Fertility & IVF..

Read this also..Reliance Foundation Hits Major Skilling Milestone: 3 Lakh Youth Trained..

10 వేల గ్రామాల్లో సర్వే: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10,000 రెవెన్యూ గ్రామాల్లో శాటిలైట్ ఆధారిత లెక్కింపు పూర్తయింది. మ్యాపులు అందుబాటులో లేని 870 గ్రామాలను మాత్రమే మినహాయించారు.

రైతులకు చేకూరే ప్రయోజనాలు:
ఈ శాటిలైట్ ఆధారిత గణాంకాలు భవిష్యత్తులో వ్యవసాయ పాలసీల అమలులో కీలకం కానున్నాయి:

పంట భీమా: పంట నష్టపోయిన ప్రతి రైతుకు పారదర్శకంగా, వేగంగా భీమా పరిహారం అందేలా చూస్తుంది.

ధాన్యం సేకరణ: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సకాలంలో నిర్వహించడానికి వీలవుతుంది.

ప్రభుత్వ పథకాలు: రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రైతుకూ నేరుగా చేరేలా ఈ డేటా ఉపయోగపడుతుంది.

డిజిటల్ వ్యవసాయం దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్న తరుణంలో, వర్సిటీ రూపొందించిన ఈ నివేదిక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుంది.