365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జనవరి 31,2026: దేశీ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఒక కీలక సంధిగ్ధంలో నిలుచుంది. మరో పక్క బడ్జెట్-2026 ముంచుకొస్తున్న వేళ, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసే ప్రకటనలు బ్యాంకుల భవిష్యత్తును, స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి. అప్పుల ప్రణాళికలు (Borrowing Plans) మొదలుకొని మౌలిక వసతుల కల్పన (Capex) వరకు.. ప్రభుత్వం ఇచ్చే సంకేతాల కోసం బ్యాంకింగ్ రంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

వడ్డీ రేట్లపై ఆర్బీఐ మౌనం.. బడ్జెటే కీలకం..!

ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్ల విషయంలో ‘యథాతథ’ స్థితిని కొనసాగించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటు (Fiscal Deficit) లక్ష్యాన్ని ఏ మేరకు నిర్దేశించుకుంటుందనే దానిపైనే ఆర్బీఐ తదుపరి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి.

ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ: అంతర్జాతీయ అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది.

Read this also..Gold and Silver Prices Plummet as Markets Brace for Union Budget 2026..

Read this also..Unicommerce Expands Logistics Portfolio with ‘Shipway Cargo’ for B2B and Quick Commerce..

బడ్జెట్ సంకేతాలు..

ప్రభుత్వం మార్కెట్ నుంచి చేసే అప్పులు తగ్గితే, బ్యాంకులకు నిధుల లభ్యత పెరిగి వడ్డీ రేట్ల తగ్గింపునకు మార్గం సుగమమవుతుంది.

బ్యాంకుల లాభదాయకతకు పరీక్ష

గత కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు (NIM) ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంకులు తమ రుణ వృద్ధికి తగ్గట్టుగా డిపాజిట్లను సమీకరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

ఇదీ చదవండి..శాటిలైట్ డేటాతో సాగు లెక్కలు: ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న PJTAU

Read this also..PJTAU to Submit Landmark Satellite-Based Crop Report to Telangana Government on Feb 6..

మూలధన వ్యయం (Capex)..

బడ్జెట్‌లో మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయిస్తే, కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరిగి బ్యాంకుల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది.

ఇన్వెస్టర్ల ఆందోళన: ర్యాలీనా.. అమ్మకాల ఒత్తిడా..?

బడ్జెట్ రోజున బ్యాంకింగ్ షేర్లలో భారీ అస్థిరత (Volatility) చోటుచేసుకోవడం సహజం.

సానుకూల అంశాలు: ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, పన్ను రాయితీలు ఇస్తే మార్కెట్ పరుగు తీసే అవకాశం ఉంది.

ప్రతికూల అంశాలు ఏమిటంటే ..?

ప్రభుత్వం అప్పుల పరిమితిని పెంచితే బాండ్ ఈల్డ్స్ పెరిగి బ్యాంకింగ్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి రావచ్చు.

బడ్జెట్ 2026 కేవలం ఒక ఏడాది లెక్కల పత్రం మాత్రమే కాదు.. ఇది రాబోయే కాలంలో బ్యాంకుల నిర్వహణ సామర్థ్యాన్ని, రుణ వితరణను ప్రభావితం చేసే దిక్సూచి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.