365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 1,2026: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సందడి నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రుల య్యారు. శనివారం (జనవరి 31) రాత్రి ఉపాసన ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
Read this also..Unicommerce Expands Logistics Portfolio with ‘Shipway Cargo’ for B2B and Quick Commerce..
ఇదీ చదవండి..శాటిలైట్ డేటాతో సాగు లెక్కలు: ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న PJTAU
ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపాసనతో పాటు, ఇద్దరు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఎంతో ఆనందంతో, కృతజ్ఞతా భావంతో ఈ వార్తను పంచుకుంటున్నాము. చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించారు.
తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. తాతామ్మలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు దైవప్రసాదంగా భావిస్తున్నాము” అని చిరంజీవి పేర్కొన్నారు.

ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా.. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇప్పటికే ‘క్లింకార’ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కవలల రాకతో వారు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులయ్యారు.
గత ఏడాది దీపావళి సందర్భంగా ఉపాసన తన ‘సీమంతం’ వీడియోను షేర్ చేస్తూ, ఈసారి పండుగ ‘డబుల్ సెలబ్రేషన్’ అంటూ కవలల రాకపై అప్పట్లోనే సంకేతాలిచ్చారు.
మెగా వారసుడు, వారసురాలు ఒకేసారి అడుగుపెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు మెగా కుటుంబానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి..బ్యాంకుల చూపు.. బడ్జెట్ వైపు.. పరుగు తీస్తాయా? వెనకడుగు వేస్తాయా?
Read this also..Gold and Silver Prices Plummet as Markets Brace for Union Budget 2026..
చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, ఈ శుభవార్త మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
