365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 1,2026: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) తల్లిదండ్రులైన వేళ, మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని అపోలో ఆసుపత్రి వేదికగా పంచుకున్నారు.
శనివారం అర్ధరాత్రి దాటాక (జనవరి 31, 2026) జరిగిన ఈ శుభ పరిణామంతో అపోలో ఆసుపత్రి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న చిరంజీవి తమ వారసులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆనందాన్ని మెగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
ఉపాసనతో పాటు ఇద్దరు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు, చిరంజీవి వెల్లడించారు. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ప్రసవం సురక్షితంగా జరిగిందని, తల్లీబిడ్డల ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ఈ సందర్భంగా ధ్రువీకరించారు.
ఇదీ చదవండి..చిరంజీవి ఇంట్లో మెగా వారసుడి సందడి..మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చిన ఉపాసన..
ఇదీ చదవండి..బ్యాంకుల చూపు.. బడ్జెట్ వైపు.. పరుగు తీస్తాయా? వెనకడుగు వేస్తాయా?
Read this also..Gold and Silver Prices Plummet as Markets Brace for Union Budget 2026..
మీడియాతో మాట్లాడిన చిరంజీవి, “తాతగా ఈ క్షణం నాకెంతో ప్రత్యేకం. మా కుటుంబంలోకి ఈ చిన్నారుల రాక దైవ ప్రసాదంగా భావిస్తున్నాను. చరణ్, ఉపాసనలకు కవలలు కలగడం, అందులోనూ ఒక బాబు, ఒక పాప ఉండటం మెగా కుటుంబం పరిపూర్ణమైందని అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
ఇప్పటికే మనవరాలు ‘క్లింకార’ రాకతో వెలుగులు నిండిన ఇంట్లో, ఇప్పుడు ఈ కవలల రాకతో ఆనందం మరింత రెట్టింపైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మెగా వారసుడు, వారసురాలు ఒకేసారి అడుగుపెట్టారన్న వార్త తెలియగానే అభిమానులు అపోలో ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి తమ అభిమాన నటుడి కుటుంబంలో జరిగిన వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
