365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 2,2026: దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు తనదైన శైలిలో నృత్యాలతో మెప్పించిన నటి డిస్కో శాంతి. ఆమె సోదరి, నటి సుచిత్ర తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా తన సినీ కెరీర్, తన సోదరితో ఉన్న అనుబంధం, ప్రస్తుత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
సినీ నేపథ్యం..
సుచిత్ర మాట్లాడుతూ.. “మా కుటుంబం మొదటి నుంచీ కళా నేపథ్యం ఉన్నదని చెప్పారు. తాను సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగిందని అన్నారు. నా సోదరి శాంతి (డిస్కో శాంతి) అప్పట్లో స్టార్ డ్యాన్సర్‌గా బిజీగా ఉండేవారు.
నేను కూడా కొన్ని సినిమాల్లో నటించినా, ఆమెకు దక్కినంత గుర్తింపు కాకపోయినా నాదైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాను” అని గుర్తు చేసుకున్నారు.
Read this also..Budget 2026: STT Hike on Derivatives and New Buyback Tax Rules-Key Takeaways for Investors..
ఇదీ చదవండి..చిన్మయ మిషన్ ఢిల్లీకి MG హెక్టర్ అంబులెన్స్‌ను అందజేసిన JSW MG మోటార్ ఇండియా..
సోదరితో అనుబంధం.. శ్రీహరి గారి జ్ఞాపకాలు.
తన సోదరి డిస్కో శాంతి గురించి చెబుతూ సుచిత్ర కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. “శాంతి నా ప్రాణం. తను సినీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను చూసింది.
ముఖ్యంగా బావగారు (దివంగత నటుడు శ్రీహరి) మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆయన కేవలం మాకు బావ మాత్రమే కాదు, ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం..
ప్రస్తుతం తాను కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. “చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. అయితే మంచి కథలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నాను” అని సుచిత్ర వివరించారు.
