365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 4, 2026: భాగ్యనగరంలో ప్రయాణ ముఖచిత్రం మారుతోంది. వేగం కంటే సౌకర్యానికే ప్రయాణికులు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తమ రోజువారీ ప్రయాణాలకు ‘స్కూటీ’ రైడ్ల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ రాపిడో (Rapido) వెల్లడించింది.
గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో స్కూటీ రైడ్ల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. గతంలో నెలకు 64 వేలుగా ఉన్న రైడ్లు, ప్రస్తుతం 11.3 లక్షలకు చేరడం విశేషం. అంటే కేవలం అరఏడాది కాలంలోనే 18 రెట్ల వృద్ధి నమోదైంది. ప్రస్తుతం నగరంలో ప్రతిరోజూ సగటున 50,000 స్కూటీ రైడ్లు జరుగుతున్నాయి.
Read this also:Rapido’s ‘Scooty’ Category Sees 18x Growth in Hyderabad, Driven by Women and Senior Citizens..
Read this also:World Cancer Day 2026: Experts Urge Personalized Care and Early Action Under “United by Unique” Theme..
సాధారణ బైక్ రైడ్ల కంటే స్కూటీ రైడ్ల పట్ల మహిళా ప్రయాణికులలో ఆసక్తి ఎక్కువగా ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు:
సులభమైన డిజైన్: స్కూటీకి ఉండే ‘స్టెప్-త్రూ’ డిజైన్ వల్ల ఎక్కడం, దిగడం చాలా సులభం.
ఇదీ చదవండి..స్టార్టప్‌లకు ‘బోయింగ్’ ప్రోత్సాహం.. ‘బిల్డ్’ ఐదో ఎడిషన్ దరఖాస్తులు ప్రారంభం!
Read this also:Boeing Launches Fifth Edition of BUILD Program to Boost Indian Startups..
తక్కువ ఎత్తు: సీటు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల మహిళలు, వృద్ధులకు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా అనిపిస్తోంది.
పెరిగిన వాటా: రాపిడో బైక్ రైడ్లలో మహిళల వాటా 25% ఉండగా, స్కూటీ కేటగిరీలో అది 35% కి పెరగడం గమనార్హం.

స్వల్ప దూర ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్
మెట్రో స్టేషన్లకు వెళ్లాలన్నా, ఆఫీస్ పని మీద వెళ్లాలన్నా లేదా దగ్గర్లోని ఆసుపత్రులు, దుకాణాలకు వెళ్లాలన్నా నగరవాసులు స్కూటీనే ఎంచుకుంటున్నారు. ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం సులభతరం కావడమే దీనికి కారణం.
“హైదరాబాద్ ప్రయాణికుల అవసరాల్లో మార్పు వస్తోంది. కేవలం వేగమే కాకుండా భద్రత, సౌకర్యం కూడా ముఖ్యమని స్కూటీ వృద్ధి నిరూపిస్తోంది. మహిళలు, వృద్ధులకు మరింత చేరువయ్యేలా మా సేవలను విస్తరిస్తున్నాం.”
