365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,ఫిబ్రవరి 7,2026: తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. 2026-28 సంవత్సరాలకు సంబంధించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతూ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గడువు తేదీ: ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 9, 2026 నుంచి ప్రారంభం కానుంది. వెబ్సైట్: అర్హులైన వారు http://ipr.telangana.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల (ఫిబ్రవరి) 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్డులను 2026-28 కాలపరిమితికి జారీ చేయనున్నారు.
Read this also:SBI Hits Record Performance: Q3 Net Profit Climbs 13% to Rs.21,317 Crore..
Read this also:India-US Trade Deal Deciphered – Winners, Protected Sectors, and Consumer Impact..
దరఖాస్తు విధానం ఎలా..?
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ల కోసం మీడియా యాజమాన్యాలు తమ ప్రతినిధుల జాబితాను నేరుగా సమాచార శాఖ కమిషనర్‌కు సమర్పించాలి.
ఇదీ చదవండి..హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన అరుణ్ ఐస్‌క్రీమ్స్..
Read this also:Arun Icecreams Smashes Guinness World Record in Hyderabad with 5,000+ Children..
జిల్లా స్థాయి కార్డుల కోసం సంబంధిత జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారులకు (DPRO) జాబితాలను పంపాల్సి ఉంటుంది.

యాజమాన్యాలు జాబితా పంపిన తర్వాతే సంబంధిత జర్నలిస్టులు వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలే సమాచార శాఖ మంత్రి అక్రిడిటేషన్ మోడ్యూల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
