fire-broke

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,దేవాస్ ,ఏప్రిల్ 10,2023:దేవాస్ లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నగరాన్ని ఉజ్జయినికి కలిపే రహదారిపై ఉన్న పాత టైర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు భారీగా వ్యాపించాయి.

మంటలు చాలా ఎక్కువగా పెరగడం ప్రారంభింవడంవల్ల దీంతో జనం అక్కడికక్కడే గుమిగూడారు. వెంటనే అక్కడున్న ప్రజలు అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపు చేశారు. రబ్బరు టైర్లు ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

దాదాపు 5 గంటల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని విచారణలో తేలింది. అగ్ని ప్రమాదం వల్ల చాలా నష్టం వాటిల్లింది. అయితే అగ్నిప్రమాదం వల్ల ఎంతమేరకు నష్టం వాటిల్లింది అనేది ఇంకా తెలియలేదు.

fire-broke

టైర్ల గోడౌన్‌కు సమీపంలో చెత్త గోడౌన్‌లు కూడా ఉన్నాయని, అక్కడ భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయాయని చెప్పారు. అగ్నిప్రమాదం వల్ల స్క్రాప్ గోదాంలో చాలా నష్టం జరిగే అవకాశం ఉంది.

టైర్ గోదాంలో మంటలు చెలరేగినట్లు కంట్రోల్ రూమ్ నుంచి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిందని ఫైర్ టెక్నీషియన్ అనుభవ్ చందేల్ తెలిపారు. దాదాపు 5 గంటల శ్రమ తర్వాత మంటలను అదుపు చేయగలిగారు. టైర్ల గోడౌన్‌కు సమీపంలో నిర్మించిన షెడ్డుకు కూడా భారీ నష్టం వాటిల్లింది.