365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 8,2025: డిజిటల్ యుగంలో తమ వ్యాపారాలను మరింతగా విస్తరించుకోవాలనుకునే చిన్న వ్యాపారులకు హైదరాబాద్ వేదికగా ఒక సరికొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఐఎస్బీ పూర్వ విద్యార్థిని, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ డాక్టర్ మణి పవిత్ర ‘క్రియేటర్ వర్స్’ పేరుతో దేశంలోనే మొట్టమొదటి ‘కంటెంట్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.
జూబ్లీ హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రం చిన్న వ్యాపారులను సొంతంగా వీడియో కంటెంట్ సృష్టించేలా శిక్షణ ఇవ్వనుంది.
తమ వ్యాపార కథలను మరింత ప్రభావవంతంగా వినియోగదారులకు చేరవేయడానికి వీడియో కంటెంట్ ప్రాముఖ్యతను గుర్తించిన డాక్టర్ మణి పవిత్ర, లక్ష మంది వ్యాపార యజమానులను వీడియో క్రియేటర్లుగా మార్చాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా డాక్టర్ మణి పవిత్ర మాట్లాడుతూ, “ప్రతి వ్యాపార యజమానికి వారి కథను చెప్పే హక్కు ఉంది. వీడియో కంటెంట్ అనేది ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన మాధ్యమం.

చాలా మంది చిన్న వ్యాపారులు కంటెంట్ సృష్టిపై సరైన అవగాహన లేక వెనుకబడిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్గా మారడం కష్టమైన పనేమీ కాదు. సరైన శిక్షణతో ఎవరైనా అద్భుతమైన కంటెంట్‌ను సృష్టించగలరు” అని అన్నారు.
క్రియేటర్ వర్స్ ఎలా పనిచేస్తుంది?
లాంచ్ ప్యాడ్ సెషన్: ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ అవగాహన సదస్సు జరుగుతుంది.
3 రోజుల వీడియో బూట్‌క్యాంప్: ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే వారికి 100 వరకు సొంత వీడియోలు తయారు చేయడం, ఏడాది పాటు సరిపడా కంటెంట్‌ను రూపొందించడం, స్క్రిప్ట్ రాయడం, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, కొత్త ఆలోచనలు ఎలా రాబట్టాలి అనే విషయాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా, ప్రొఫెషనల్ మార్కెటింగ్ మెటీరియల్‌ను కూడా అందిస్తారు.
తదుపరి బూట్‌క్యాంప్: మే 30, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు.
క్రియేటర్ వర్స్ ప్రత్యేకతలు:52 ప్రత్యేకమైన కథా గదులు
ప్రొడక్షన్ హౌస్, కోచింగ్ సెంటర్ కలయిక నిపుణులచే ప్రత్యక్ష మార్గదర్శకత్వం,ఉత్పత్తి సహాయం ప్రారంభ దశలోనే 250 మందికి పైగా వ్యాపార యజమానులను విజయవంతంగా కంటెంట్ క్రియేటర్లుగా మార్చిన ఈ కేంద్రం, త్వరలో దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది.

“ఈరోజు ప్రపంచంలో కంటెంట్‌దే రాజ్యం. అందులోనూ ఒరిజినల్ వీడియో కంటెంట్‌కు తిరుగులేదు. క్రియేటర్ వర్స్ కేవలం ఒక కోర్సు కాదు, ఇది ఒక ఉద్యమం. వ్యాపారం ,డిజిటల్ ప్రభావం మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చి, భారతీయ వ్యాపారుల విజయగాథలను ప్రపంచానికి చాటి చెప్పడానికి మేము కృషి చేస్తున్నాం” అని డాక్టర్ పవిత్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
చిన్న వ్యాపారాలు తమ ఉత్పత్తులను, సేవలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయడానికి ‘క్రియేటర్ వర్స్’ ఒక బలమైన వేదికగా మారనుంది.