365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 20,2025: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, టాలెంటెడ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘L2E: ఎంపురాన్’. 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరుచుకుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 20న మధ్యాహ్నం 1:08 గంటలకు విడుదల చేయనున్నారు.

మలయాళంలో ఇదే ఫస్ట్ టైమ్..!

ఈ ట్రైలర్ విడుదల ప్రత్యేకంగా నిలవనుంది. మలయాళ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ముంబై, మలాడ్‌లోని ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది. అంతేకాదు, ఈ ట్రైలర్ ప్రత్యేకంగా మీడియాకు ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రదర్శించనున్నారు.

Read this also…“L2E: Empuraan” – First Malayalam Film with IMAX® Trailer Launch..!

ఇది కూడా చదవండిజీ తెలుగులో విజయ్ ‘GOAT’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

ఖురేషి అబ్రామ్ మిస్టరీ కొనసాగనుంది..!

‘లూసిఫర్’ చిత్రంలో మోహన్‌లాల్ పోషించిన స్టీఫెన్ నెడుంపల్లి క్యారెక్టర్ ఇప్పుడు మరింత డార్క్ షేడ్‌లో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం సంకేతాలు ఇస్తోంది. ‘L2E: ఎంపురాన్’ లో ఖురేషి అబ్రామ్‌గా ఆయన మాస్ లుక్‌తో అదరగొట్టనున్నాడు.

ఈ భారీ ప్రాజెక్టులో టోవినో థామస్, అభిమన్యు సింగ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, మంజు వారియర్, సాయికుమార్, ఇంద్రజిత్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ (Game of Thrones ఫేమ్) ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ రిలీజ్..!

‘L2E: ఎంపురాన్’ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో మార్చి 27న భారీగా విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు. హిందీలో అనిల్ తడానీ (AA Films), కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో శ్రీ గోకులం మూవీస్ సినిమాను విడుదల చేయనున్నాయి.

ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మురళీ గోపీ ఈ సినిమాకు కథ అందించారు.

ఇది కూడా చదవండిసి డుకాటి 2025 స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ లాంచ్..

Read this also…OPPO Reno13 Skyline-Blue variant goes on sale tomorrow..

ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న మలయాళ తొలి సినిమా ‘L2E: ఎంపురాన్’ గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్, స్టన్నింగ్ మేకింగ్‌తో ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని పంచనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మార్చి 20న ట్రైలర్ – మార్చి 27న గ్రాండ్ రిలీజ్..!