365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 3,2025: ఏ-వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ (A-One Steels India Limited) సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్  (ఐపీవో) కింద షేర్లు జారీ చేయడం ద్వారా రూ. 650 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి (సెబీ) ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.

దీని ప్రకారం ఒక్కో షేరు ముఖ విలువ రూ. 10గా ఉంటుంది. క్రిసిల్ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో క్రూడ్ స్టీల్ సామర్థ్యంపరంగా టాప్ 5 ఉత్పత్తి సంస్థల్లో ఒకటిగా10 ఉక్కు ఉత్పత్తులు,పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేస్తున్న ఏకైక కంపెనీగా ఏ-వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

రూ. 600 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్‌హోల్డర్లు రూ. 50 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు.

ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయబడతాయి. పీఎల్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఖంబట్టా సెక్యూరిటీస్ లిమిటెడ్ (Khambatta Securities Limited) ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.