365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,ఆగష్టు 25,2022:వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా హాల్ నందు ఏర్పాటుచేసిన సమావేశానికి ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ,ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పలువురు ప్రభుత్వ అధికారులు,స్తంభాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేసే పనుల గురించి చర్చించడం జరిగింది.మౌనిక గణేష్ నిమజ్జనం దృశ్య చేపట్టవలసిన చర్యల్ని శాఖల వారీగా కలెక్టర్ గారు సమీక్ష చేయడం జరిగింది.
ఖమ్మం నగరంలో మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా మట్టి విగ్రహాలని ప్రతిష్టించాలని పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు.ఈ సందర్భంగా నిమజ్జనం సందర్భంగా గణేష్ విగ్రహాలని త్వరగా మున్నేరు వద్దకు తీసుకురావాలని 10 గంటలకే నిమజ్జనం శోభాయాత్ర మొదలు చేయాలని వారు సూచించారు.
ఖమ్మం నగరంలో ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 10 నిమజ్జనం వరకు జరగనున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకారం అందిస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ గారు, స్తంభాద్రి ఉత్సవ సమితి అధ్యక్షులు వినోద్ లాహోటి,కార్యాధ్యక్షుడు గెంటేల విద్యాసాగర్,సెక్రెటరీ జయపాల్ రెడ్డి,కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ,ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లిక అంజయ్య,ఉపాధ్యక్షులు డౌలె సాయి కిరణ్,సుధాకర్ చంద్రశేఖర్,పోలీస్ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..