Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,మార్చి 30,2022:హోటల్ మెర్క్యూర్ హైదరాబాద్ కె సి పి, పంజాగుట్ట వారు తమ ప్రాంగణంలో టెర్రస్, రూఫ్ టాప్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నారు.హోటల్ పై ప్లోర్ లో అందుబాటులోనికి రానున్న ఈ బార్,రెస్టారెంట్ హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ , మెట్రో రైలు మార్గం,అందమైన ప్రదేశాలను మీరు తింటున్న,త్రాగుతున్న సమయంలో విభిన్న కోణం లో చూసేందుకు అవకాశమిచ్చి సరికొత్త అనుభూతులను మిగులుస్తుంది.

ఈ రూఫ్ టాప్ రెస్టారెంట్ లో హోటల్ మెర్క్యూర్ హైదరాబాద్ కెసిపి కి చెందిన నిపుణులైన ఛెఫ్ ల ద్వారా ఎంపిక చేయబడి, తయారు చేయబడ్డ భారతీయ,తూర్పు ఆసియా ప్రాంతాల వంటకాలను అందించనున్నారు.ఈ సరికొత్త రెస్టారెంట్ వివరాలను వెల్లడించడానికి నేడు హోటల్ మెర్క్యూర్ హైదరాబాదు కెసిపి వారు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో శ్రీ సౌమిత్ర పరారి, జనరల్ మేనేజల్, హోటల్ మేర్క్యూర్ హైదరాబాదు కె సి పి వారితో పాటూ ఇతర ముఖ్యమైన ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ సౌమిత్ర పరారి, జనరల్ మేనేజర్, హోటల్ మెర్క్యూర్ హైదరాబాద్ కె సి పి వారు మాట్లాడుతూ రెస్టారెంట్,థీమ్ ను వివరించారు.

టెర్రస్ అనే ఈ సరికొత్త రూఫ్ టాప్ బార్,రెస్టారెంట్ లో సరికొత్త అందాలను వీక్షిస్తూ,
అత్యద్భుతమైన అందాలత మధ్య తింటూ, త్రాగుతూ, సోషలైజ్ చేస్తూ గడిపేందుకు వీలు కలిపించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఆకట్టుకునే డెకోర్, వీనులవిందు చేసే లైటింగ్ తో ఎంతో అద్భుతమైన హైదరాబాదు సిటీ అందాలు, బ్యూటిఫుల్ కిచెన్,గ్రిల్ లు భోజన ప్రియులకు దీనిని ఒక మంచి డెస్టినేషన్ గా ఉంటుందన్నారు.అనంతరం రెస్టారెంట్ మెనూ కు సంబంధించిన వివరాలను సందర్భంగా శ్రీ సౌమిత్ర పరారి, జనరల్ మేనేజర్, హోటల్ మెర్క్యూర్
హైదరాబాద్ కె సి పి వారు వెల్లడిస్తూ రెస్టారెంట్ లో భారతీయ, తూర్పు ఆసియా, ఓరియంటల్ వంటకాలను సాంప్రదాయపద్దతిలో తయారు చేసి అందించడం జరుగుతుందని చెప్పారు.

ఈ వంటకాలన్నింటినీ ఐదు రుచులైన సాల్టీ, స్పైసీ, సోర్, బిట్టర్, స్వీట్ ల మేళిమి మిశ్రమాలతో రూపొందించడమే కాకుండా హైదరాబాదీయుల టేస్ట్ బడ్ లకు నచ్చిన, మెచ్చినవై ఉంటాయని వివరించారు. ప్లా రెడ్ ప్రిక్, సతాయ్ చికెన్, డంప్లింగ్స్, కబాబ్స్, ఇంటర్నేషనల్ సలాడ్స్ తో పాటూ నోరూరించే డెజర్ట్స్ ఈ మెనూలో భాగంగా ఉంటాయని ఆయన తెలిపారు.ఎంతో అందమైన వ్యూ తో నోరూరించే రుచులను ఆస్వాదించడమే కాకుండా హాట్ హాట్ రిథమ్స్ ను మీకందించే లైవ్ బ్యాండ్,అత్యద్భుతమైన అనుభవాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో అస్వాదించడానికి మీకు టెర్రస్ స్వాగతం పలుకుతోంది.

error: Content is protected !!