365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్, మే 3,2024: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ షేర్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ 2024 మే 8, బుధవారం నాడు ప్రారంభం కానుంది.
ఐపీవో కింద రూ.1,000 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2,000 కోట్ల వరకు విలువ చేసే షేర్లను బీసీపీ టాప్‌కో VII పీటీఈ. లిమిటెడ్ (BCP Topco VII Pte. Ltd.) (ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డరు) విక్రయించనుంది.
తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను కంపెనీ భవిష్యత్తులో రుణాలిచ్చేందుకు కావాల్సిన మూలధనం అవసరాలకు సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించుకోనుంది. ఈ ఆఫర్‌కు ఎన్ఎస్ఈ అధీకృత స్టాక్ ఎక్స్చేంజీగా ఉంటుంది.
“ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌కు ఈ లిస్టింగ్ ఒక మైలురాయి కాగలదు. భారత్‌ను తీర్చిదిద్దే వ్యాపారాలను నిర్మించడంలో అత్యుత్తమంగా కృషి చేస్తూ పురోగమిస్తుండటానికి ఈ సంస్థ పరివర్తన ఒక చక్కని ఉదాహరణగా నిలవగలదు. వ్యాపారాన్ని విస్తరించడంలో తోడ్పడేందుకు పటిష్టమైన మా నెట్‌వర్క్, స్థాయి, అత్యుత్తమ గ్లోబల్ విధానాలను సమకూర్చాం.
ప్రక్రియలను డిజిటైజ్ చేయడం ద్వారా కంపెనీకి సాధికారత కల్పించగలిగాం. ఇదొక అద్భుతమైన భాగస్వామ్యం. సానుకూలాంశాల దన్నుతో వ్యాపారం ఈనాడు ఈ స్థాయికి చేరడం మాకెంతో గర్వకారణమైన అంశం” అని బ్లాక్‌స్టోన్ హెడ్ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా శ్రీ అమిత్ దీక్షిత్ తెలిపారు.
“అసంఖ్యాక భారతీయుల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లక్ష్యంలో భాగం కావడం, కంపెనీ పరివర్తనలో మరియు వృద్ధిలో కీలక పాత్ర పోషించడం ఎంతో సంతృప్తికరమైన అంశం.
కంపెనీ నాయకత్వంతో కలిసి పని చేస్తూ, బ్లాక్‌స్టోన్‌కి అందుబాటులో ఉన్న మూలధనం, వనరులు, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ సంస్థను నిర్మించడం మాకు ప్రాధాన్యతాంశం” అని బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముకేశ్ మెహతా తెలిపారు.
“తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడంలో అనేక కుటుంబాలకు సాధికారత కల్పించే దిశగా ముందుకు సాగుతున్న మాకు ఇది ఒక కీలకమైన మైలురాయి. ‘ఘర్ బనేగా తో దేశ్ బనేగా’ నినాదాన్ని సాకారం చేస్తూ, జాతి నిర్మాణానికి, పటిష్టమైన కమ్యూనిటీలకు పునాదిరాయి వేసే బాధ్యతను చేపట్టి మేము ముందుకు సాగుతున్నాం” అని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రిషి ఆనంద్ తెలిపారు.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సంస్థలు ఈ ఆఫర్‌కు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.