365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, డిసెంబర్ 31, 2022 : కొత్త ఏడాది లో అన్ని రూల్స్ మారుతున్నాయి. ముఖ్యంగా పాన్ కార్డు విషయం లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా వచ్చే ఏడాది (2023) మార్చి 31వతేదీ నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డులను డీయాక్టివేట్ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
అయితే ఈ మార్పు జనవరిలో కాకుండా ఏప్రిల్ మొదటి తేదీ నుంచి వర్తింపజేయడం కాస్త ఊరట కలిగించే విషయమే.
ఆదాయపు పన్ను శాఖ పబ్లిక్ కన్సల్టేషన్‌లో, “పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేశారు.
ఇది చాలా అవసరం. ఆలస్యం చేయవద్దు, ఈ రోజే లింక్ చేసుకోండి.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయించిన కేటగిరిలోకి రాని పాన్ కార్డుదార్లందరూ మార్చి 31, 2023లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి.
ఆధార్ ను పాన్ కార్డుకి లింక్ చేసుకోకపోతే 2023 ఏప్రిల్ 1వతేదీ నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు.