365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 7,2025: ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన ప్రఖ్యాత బ్రాండ్ ఆశీర్వాద్ మసాలాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నేచురల్ స్టార్ నానిని నియమించింది.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాని, తన సహజ నటన, నమ్మకమైన వ్యక్తిత్వం, సంప్రదాయాలకు కట్టుబాటు వంటి లక్షణాలతో ఆశీర్వాద్ మసాలాల ప్రధాన విలువలకు ప్రతినిధిగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో, ‘‘దమ్ముమీదే.. స్టార్ మీరే’’ అనే నినాదంతో కొత్త టెలివిజన్ ప్రకటనను సంస్థ విడుదల చేసింది.
Read this also…ITC’s Aashirvaad Masalas and Nani Team Up to Spice Up Telugu Kitchens
Read this also…CARE Hospitals Unveils ‘SANGHAM’ Membership Card on World Health Day
ఈ ప్రచారం ద్వారా తెలుగింటి వంటింటిలో రుచి పండించే గృహిణుల కృషిని గౌరవించేందుకు ఐటీసీ ముందుకొచ్చింది. ప్రతిరోజూ ప్రేమతో, నైపుణ్యంతో వంటలు చేసే వారికి ఇది శ్రద్ధాంజలి అని కంపెనీ తెలిపింది. గుంటూరు మిర్చి మసాలా నుంచి ప్రత్యేక మిశ్రమాల వరకు ఆశీర్వాద్ మసాలాలు స్థానిక రుచులకు న్యాయం చేస్తాయని సంస్థ పేర్కొంది.

ఈ సందర్భంగా ఐటీసీ స్పైసెస్ విభాగం బిజినెస్ హెడ్ పియూష్ మిశ్రా మాట్లాడుతూ… “తెలుగు సంస్కృతికి దగ్గరగా ఉండే నానితో భాగస్వామ్యం కొనసాగడం గర్వంగా ఉంది. ఈ మసాలాలు శక్తివంతమైన రంగు, ఘాటు రుచి కలిగి ఉండేలా మేము మిశ్రమాలను తిరిగి రూపొందించాం. తెలుగు గృహిణులకు ఇది ఓ నమ్మకమైన స్నేహితురాలిగా మారుతుందని భావిస్తున్నాం” అని చెప్పారు.
నాని మాట్లాడుతూ… “తెలుగు వంటకాల్లోని భిన్న రుచులను, వాటి వెనుకున్న ప్రేమను సెలబ్రేట్ చేయడం ఈ ప్రచారంలో ప్రత్యేకత. ఆశీర్వాద్ మసాలాలకు ప్రచారకర్తగా వ్యవహరించడం గర్వకారణం” అన్నారు.
ఇది కూడా చదవండి…వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ‘సంగం’ మెంబర్షిప్ కార్డు ఆవిష్కరించిన కేర్ హాస్పిటల్స్..
ఇది కూడా చదవండి…థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్‌ను ప్రీ-బుకింగ్‌లో లాంచ్ చేసిన జెప్టో
ఈ టీవీసీ ప్రస్తుతానికి ప్రాంతీయ టీవీ చానళ్లు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ వేదికలపై ప్రసారం అవుతోంది. ప్రాథమిక సుగంధ ద్రవ్యాలు, మిశ్రమ మసాలాలు, మొత్తం మసాలా వస్తువులు వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులతో తెలుగు వంటలకు ‘ధమ్’ను అందించాలన్నదే ఆశీర్వాద్ లక్ష్యం.
టివిసి లింక్‌ను చొప్పించండి: