365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 20, 2025: ఆధ్యాత్మిక గురువు, గాయని అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్ అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరగనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 20న హెచ్‌ఐసీసీలో జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అచ్యుత గోపి మాట్లాడుతూ.. భగవద్గీత, భాగవతం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి వివరించారు.

కృష్ణుడు తన జీవితానికి వెలుగు అని, ఆయన ఎంచుకున్న ప్రజల మధ్య జీవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు ప్రజల్లో భక్తిభావం ఎక్కువగా ఉందని, హైదరాబాద్‌ ప్రజలను కలవడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.

ఇది కూడా చదవండి…మీరు ఉపయోగించే వైఫై స్లోగా ఉంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు..

“చల్ మన్ వృందావన్” సంస్థ ఆధ్వర్యంలో, “రాధాకృష్ణ అకేషన్స్” సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అక్టోబర్ 4న జరిగే ఈవెంట్ టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటోలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక సంగీత యాత్రలో భాగం కావాలనుకునేవారు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.