365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,ఆగస్టు13,2022: కాకినాడ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘ టనలో ట్యాంకర్ వేగంగా ఢీకొనడంతో హోంగార్డు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. తొండంగి మండలం ప్రాంతంలోని బెండపూడి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున మూడు గంటలకు ఈ సంఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్‌టిఏ చెక్‌పోస్ట్ వద్ద యాసిడ్ లోడ్ తో ట్యాంకర్ వేగంగా వెళ్లి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతోపాటురోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తులను గుద్దింది. ఈ ఘటనలో గోవిందరాజులు అనే హోంగార్డును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గాయపడిన మరొకరు చికిత్స పొందుతున్నారు.

ట్యాంకర్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. బాపులపాడు మండలం అంపాపురంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు అత్తిలిలో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు వెళ్తున్నారు.