Thu. Dec 26th, 2024
road-accidents

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,సెప్టెంబర్2,2022: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గురించి భారతదేశపు ప్రముఖ టెక్-ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ACKO సంస్థ విడుదల చేసింది. యాక్సిడెంట్ ఇండెక్స్ 2022 పేరుతో ఓ డాటాను వెల్లదించింది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం మాదాపూర్ అని తేల్చింది.

మాదాపూర్. బొడ్డుపాల్, ఏఎస్ రావు నగర్, కొత్తగూడా, నిజాంపేట్ కూడా ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయని ACKO యాక్సిడెంట్ ఇండెక్స్ 2022 ద్వి-వార్షిక ఎడిషన్‌లో ఆవిష్కరించింది.CKO యాక్సిడెంట్ ఇండెక్స్ 2022 ప్రకారం మాదాపుర్ లో అత్యధిక ప్రమాదాల రేటు15శాతంగా నమోదైంది. అయితే బొడ్డుపాల్, ఏ ఎస్ రావు నగర్, కొత్తగూడా వంటి ప్రాంతాల్లో 10శాతం లోపు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల వెనుక కారణాలు ఎక్కువగా ‘డ్రైవర్లు’, జంతువులు రోడ్డు దాటడం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్లపై గుంతలు, మద్యం తాగి వాహనాలు నడపడం ఇతర కారణాల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయట.

ఇండెక్స్ బయటపెట్టిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రోడ్డు ప్రమాదాలకు జంతువులు ప్రధాన కారణమని తేలింది. కుక్కలు, ఆవులు ఆశ్చర్యకరంగా ఎలుకలు కూడా ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ACKO సీనియర్ డైరెక్టర్ మోటార్ అండర్ రైటింగ్ అనిమేష్ దాస్ మాట్లాడుతూ “ప్రమాదాలకు రోడ్లు సరిగా లేకపోవడం ఒక్కటే కారణం కాదు.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు,దానితో పాటు జరిగే మరణాలు నివారించవచ్చని అన్నారు.

ఈ యాక్సిడెంట్ ఇండెక్స్ మా పాలసీ రూపకర్తలు,నిర్వాహకులకు కేవలం ఒక సహాయ హస్తం, తద్వారా వారు భారతదేశంలోని అత్యంత ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలలో చర్యలు తీసుకోవచ్చు, ఇది ట్రాఫిక్‌ను నియంత్రించ డంలోనూ ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు.

road-accidents

ACKO అనేది 70+ మిలియన్ల ప్రత్యేక కస్టమర్లకు సేవలందిస్తున్న భారతదేశపు ప్రముఖ ఇన్‌సర్‌టెక్ కంపెనీ. ఈ మొదటి-రకం నివేదిక ACKO డేటాబేస్ ద్వారా అందించింది. మౌలిక సదుపాయాలు, తాగి డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, వీధులు దాటుతున్న జంతువులు, కొంతమందిడ్రైవర్లు డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాడాలు జరుగుతున్నాయట.

ఇతర మెట్రో నగరాల్లో…బెంగుళూరులో16శాతం ప్రమాద రేటు నమోదవడంతో అతి తక్కువ ప్రమాదాలు జరిగే నగరంగా ముందుంది. ఎక్కువ ప్రమాదాలు బొమ్మనహళ్లిలో నమోదయ్యాయి, ఇందులో దాదాపు 9శాతం ప్రమాదాలు నమోదయ్యాయి. కళ్యాణ్ నగర్‌లో 8శాతం ప్రమాదాలు నమోదయ్యాయి. బెంగళూరులో అత్యధిక ప్రమాదాలు బన్నెరఘట్ట నుంచి హూడి వరకు విస్తరించి ఉన్న 50 కి.మీ.లో భారీ లాగ్‌జామ్‌లను ఎదుర్కొంటున్నాయి.

చెన్నైలో..

చెన్నైనగరంలో అత్యధిక ప్రమాదాలు గిండిలోని ట్రాఫిక్ హెవీ, ఇండస్ట్రియల్ బెల్ట్‌లలో 19శాతంప్రమాదాలు నమోదయ్యాయి, అంబత్తూరులో 14శాతం ప్రమాదాలు నమోదయ్యాయి, పూనమల్లిలో 13శాతం ప్రమాదాలు నమోద య్యాయి. మొత్తం మీద చెన్నైలో రోడ్డుప్రమాదాల రేటు 18.6శాతంగా ఉంది.

ఢిల్లీలో..

road-accidents

ఢిల్లీ నోయిడాలోని సెక్టార్ 12 ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో అత్యంత ప్రమాదాలు జరిగే ప్రాంతంగా మారింది.ఇక్కడ 9శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు ప్రధాన కారణం ‘ఇతర డ్రైవర్లు’ తర్వాత జంతువులు రోడ్డు దాటడం, రోడ్లపై గుంతలు, ర్యాష్ డ్రైవింగ్ , మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం మీద ఢిల్లీలో రోడ్డు ప్రమాదాల రేటు 20.3శాతం నమోదైంది.

ముంబైలో..

ముంబైలో 18.2శాతంప్రమాద రేటు నమోదైంది. ఇక్కడ ఘట్కోపర్ (పశ్చిమ) అత్యంత ప్రమాదాలు జరిగే ప్రాంతంగా 5శాతం మేర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ దుర్ఘటనలకు జంతువులు రోడ్డు దాటడం, రోడ్లపై గుంతలు, ర్యాష్ డ్రైవింగ్ , మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.

ACKO ప్రమాదాలకు అత్యంత సాధారణ కారణాలలో కొన్నింటిని వెలుగులోకి తీసుకురావడానికి, భారతదేశంలోని వాహనాల యజమానులు మెరుగ్గా డ్రైవ్ చేయడంలో సహాయపడటానికి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలోని డేటా ACKO డేటాబేస్ నుంచి వచ్చింది. థర్డ్-పార్టీ డేటా సోర్స్‌లు ద్వారా ఈ రిపోర్ట్ అందించగలిగింది ఆ సంస్థ.

error: Content is protected !!