365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్,డిసెంబర్ 23,2022: కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. తెలుగుచలన చిత్రంలో అనేక పాత్రల్లో ఒదిగిపోయిన కైకాల సత్యనారాయణ దాదాపు 770కు పైగా సినిమాల్లో నటించారు. ఆయనకు నవరస నట సార్వభౌమ అనే బిరుదు ఉంది.
కైకాల సత్యనారాయణ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపుతున్నారు. ఆయన ఇంటి వద్దేచికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే ఆయన చనిపోయారు.
కైకాల సత్యనారాయణ దాదాపు 770కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రతి నాయకుడిగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు.
కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలుసుకున్న పలువురు నటులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటున్నారు.
87ఏళ్ల సత్యనారాయణ 60 ఏళ్ల పాటు సినిమా రంగానికి సేవలందించారు.
సీనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా..
పలు చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా కూడా కైకాల సత్యనారాయణ నటించారు. కమేడియన్, విలన్ గాను మెప్పించారు ఆయన.
తన సినీ కెరీర్‌లో కైకాల సత్యనారాయణ ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించారు.
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రల్లో ఒదిగిపోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కైకాల సత్యనారాయణ రమా ఫిలింస్ బ్యానర్‌తో పలు సినిమాలను నిర్మించారు.
కైకాల సత్యనారాయణ ఎన్టీ ఆర్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ.
ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాలలో డిగ్రీ చదివారు.
1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.