Sun. Sep 8th, 2024
Barkaas-Indo-Arabic-restaurant

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 6, 2023: కొంపల్లి లోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ను టాలీవుడ్ సినీ నటి దివి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది నోరూరించే రుచికరమైన వంటకాలు.. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గ ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్ రెస్టారెంట్ మన హైదరాబాద్ కు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.

Barkaas-Indo-Arabic-restaurant

ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కబాబ్స్ ను రుచిచూడకుండా ఉండలేనని చెప్పారు దివి. ఈ సందర్భంగా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ఆమె సందడి చేశారు. లంబసింగి సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుందని దివి తెలిపారు.

error: Content is protected !!