365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 10, 2023: నటి నవీనా రెడ్డి విశ్వక్సేన్ నటించిన హిట్ సినిమాలో స్వప్న పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించిన నవీనా రెడ్డి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య, కృతి శెట్టి నటించిన కస్టడీలో కూడా రంజిత పాత్రలో పోలీసుగా ఛాలెంజింగ్ పాత్రలో కనిపించింది. ఇది కూడా మంచి గుర్తింపు తెచ్చింది ఆమెకు.
నవీనా రెడ్డి ప్రధాన తారాగణంతో సమానమైన ముఖ్యమైన పాత్రలతో పోటీ పడి నటించింది. ఆమె గతంలో నందమూరి బాలకృష్ణ అఖండ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో , ఆది సాయి కుమార్ యాక్ట్ చేసిన అతిది దేవోభవలో కూడా నవీనా రెడ్డి మంచి పాత్రలో కనిపించారు.

నవీనా రెడ్డి తన తాజా చిత్రం “రుద్రంగి”తో వార్తల్లో నిలిచింది. రుద్రంగి చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 7న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమాలో నవీనా రెడ్డి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది. రుద్రంగిలో నటుడు జగపతి బాబు కొత్త పాత్ర పోషించారు. రుద్రంగి సినిమాలో విమలా రామన్, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు.
నవీనా రెడ్డి అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపిస్తుంది. రుద్రంగిలో మరోసారి తన అందమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. కస్టడీ, నేను మీకు బాగా కావాల్సినవాడిని, సగం కథలు, అర్ధ శతబ్దం, త్రిశంకు, అల్లూరి (శ్రీవిష్ణు) , ఉప్పెన, హిట్ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

నవీనా రెడ్డి వెంకీ మామ,అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2 తోపాటు మరికొన్ని వినోదాత్మక చిత్రాలలో కూడా ఆమె నటించింది. నవీనరెడ్డి ఇటీవల అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఊర్వశివో రాక్షసివోలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్స్‌లో కీలక పాత్రల్లో నటించింది.
నటి, నవీనా రెడ్డి త్వరలో ప్రవాహం -(ఒక చోట ఆగదు) అనే చిత్రంలో హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు. ఆమె మరికొన్ని చిత్రాల్లో నటించనున్నారు. అందుకు సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.