Actress Rambha car accident, daughter injured

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,కెనడా, నవంబర్ 1,2022:టాలీవుడ్ నటి రంభ మంగళవారం కెనడాలో తన పిల్లలను ఇంటికి తీసుకు వెళుతుండగా ప్రమాదానికి గురైంది. యాక్సిడెంట్ కు సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఎవరికీ గాయాలు కాలేదని, అయితే తన కుమార్తె సాషాకు స్వల్ప గాయాల య్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రమాదానికి గురైన రంభ, ఆసుపత్రిలో ఉన్న తన కుమార్తె ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఒక ఆయాతో పాటు పిల్లలను పాఠశాల నుంచి పికప్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నట్లు సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పారు.

Actress Rambha car accident, daughter injured

‘ఇంటర్ సెక్షన్ వద్ద కారును ఢీకొట్టడంతో మాకు స్వల్ప గాయాలయ్యాయి. మేము సురక్షితంగా ఉన్నాము కానీ మాకు చెడు సమయం నడుస్తోంది. దయచేసి మా కోసం ప్రార్థించండి” అని నటి రంభ ట్వీట్ చేశారు.

రంభ పలు తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించింది. 2010లో ఇంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అంటారియోలో నివసిస్తున్నారు.