Mon. Dec 23rd, 2024
rashmikamandanna_kalyanjewellers

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, మార్చి30, 2023: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే, సుప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్నను ఎంచుకున్నట్లు వెల్లడించింది.

కళ్యాణ్‌ లైఫ్‌స్టైల్‌ విభాగానికి ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్మిక మందన్న భారతదేశ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలోని చిత్రాలలో నటించారు.

ఈ నియామకంతో ఆమె అమితాబ్‌ బచ్చన్‌ (గ్లోబల్‌ అంబాసిడర్‌), కత్రినా కైఫ్‌ (నేషనల్‌ అంబాసిడర్‌), నాగార్జున అక్కినేని (ఏపీ, తెలంగాణా) , ప్రభు (తమిళనాడు), శివరాజ్‌కుమార్‌(కర్నాటక),కళ్యాణి ప్రియదర్శన్‌ (కేరళ) ఇతర కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ సెలబ్రిటీలతో జత కలవనున్నారు.

rashmikamandanna_kalyanjewellers

ఈసందర్భంగా కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కళ్యాణరామన్‌ మాట్లాడుతూ ‘‘తెలుగు, కన్నడ, తమిళ నాడు మార్కెట్‌ల కోసం రష్మిక మందన్నను మా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకోవడం పట్ల ఆనందంగా ఉన్నాము.”

కళ్యాణి ప్రియదర్శితో కలిసి ఆమె మా లైఫ్‌స్టైల్‌ జ్యువెలరీ శ్రేణికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆమెకున్న ప్రజాదరణతో మా బ్రాండ్‌ మరింత మందికి చేరువకాగలదని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ ‘‘అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, ప్రభు గణేషన్‌ లాంటి గొప్ప నటులతో కలిసి కళ్యాణ్‌ కుటుంబంలో భాగం కావడం పట్ల ఆనందంగా ఉంది. మహోన్నత వారసత్వం కలిగిన బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది.

rashmikamandanna_kalyanjewellers

అందమైన డిజైన్లు, సున్నితమైన పనితనం కలిగిన కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ అంటే నాకు అమిత ఇష్టం. వారితో కలిసి చేయబోయే అద్భుత ప్రయాణం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.

error: Content is protected !!