365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,డిసెంబర్ 20,2022: ప్రముఖ జర్నలిస్ట్ అడపాల నాగేందర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అడపాల నాగేందర్ 20ఏళ్ల జర్నలిజం ప్రస్థానంలో సమాజ శ్రేయస్సు కోసం అనేక వార్తా కథనాలను అందించి.. జర్నలిస్టు అంటే జనహితం కోరేవాడని నిరూపిస్తూ.. తనదైన శైలిలో దూసుకుపోతూ..ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.
జర్నలిజం వృత్తిలో అంచెలంచెలుగా రాణిస్తూ.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు,రాజకీయ నాయకులు అడపాల నాగేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అడపాల నాగేందర్ ప్రస్తుతం హెచ్ ఎమ్ టీవీ ఖమ్మం జిల్లా రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.