365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 31,2025:‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రతిభావంతుడు రవీంద్ర బెనర్జీ ముప్పనేని, ఇప్పుడు తన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “దండోరా”తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమాలో, ప్రేమ, గౌరవం, సమాజంలో కొనసాగుతున్న వివిధ సమస్యలను ఆవిష్కరించబోతున్నారు. ఇందులో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక, టాలెంటెడ్ సింగర్ అదితి భావరాజు ఈ సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో హిట్ పాటలు పాడిన ఆమె, “దండోరా”లో నటిగా కూడా తన ప్రతిభను చూపించనున్నారు. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పలు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఇటీవల విడుదలైన “ఫస్ట్ బీట్” టీజర్‌కు చక్కటి స్పందన లభించింది. మరికొన్ని ఆసక్తికర అప్డేట్స్ ను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
సాంకేతికంగా, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె. రాబిన్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ ఆర్. శాఖమూరి, ఎడిటర్‌గా సృజన అడుసుమిల్లి, ఆర్ట్ డైరెక్టర్‌గా క్రాంతి ప్రియం, కాస్ట్యూమ్ డిజైనర్‌గా రేఖా బొగ్గారపు వ్యవహరిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరెజి, లైన్ ప్రొడ్యూసర్‌గా కొండారు వెంకటేష్ పని చేస్తున్నారు. పిఆర్ పని బియాండ్ మీడియా నుండి నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ బాధ్యతలు టికెట్ ఫ్యాక్టరీ వహిస్తోంది.

కీ నటులు:
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు.
Read This also…Aditi Bhavaraju’s Acting Debut in Dhandoraa..
ఇది కూడా చదవండి…డెట్టాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోనీ..
Read This also…MG Astor: The New Blockbuster Mid-Size SUV in India..
ఇది కూడా చదవండి…స్కూల్ స్థాయిలో స్కాలర్షిప్ ఎలా పొందవచ్చు?
సాంకేతిక బృందం:
బ్యానర్: లౌక్య ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకుడు: మురళీకాంత్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె. రాబిన్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరెజి
లైన్ ప్రొడ్యూసర్: కొండారు వెంకటేష్
పిఆర్: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ