Mon. Dec 23rd, 2024
rich-Cms_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 13,2023: భారతదేశంలో పేద సీఎంలు..ఎంత మంది..ఉన్నారు..? ధనిక సీఎంలు ఎంతమంది.. ఉన్నారు..? ఎవరి సంపాదన ఎంత అనేది ఓ సంస్థ బయట పెట్టింది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.163 కోట్ల ఆస్తులతో కోటీశ్వరుల ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ రూ.63 కోట్లు.

rich-Cms_365

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో 29 మంది (97 శాతం) కోటీశ్వరులే. వీరి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల అఫిడవిట్ విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది.

వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అత్యధికంగా రూ.510 కోట్లు కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యల్ప ఆస్తులు రూ.15 లక్షలు.

30 మంది సిఎంలలో 29 మంది కోటీశ్వరులు, భారతదేశ ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. అరుణాచల్‌కు చెందిన పెమా ఖండూ రెండో స్థానంలో, ఒడిశాకు చెందిన పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు.

rich-Cms_365

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.163 కోట్ల ఆస్తులతో కోటీశ్వరుల ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ రూ.63 కోట్లు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఆస్తులు కోటి రూపాయలకు పైగానే ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉంది.

బెంగాల్ ముఖ్యమంత్రి మమత రూ.15 లక్షలు మాత్రమే ఉంది. 13 మంది ముఖ్యమంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. వారిలో 13 మంది తమ అఫిడవిట్‌లలో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌తో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

error: Content is protected !!