365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 3,2025: భారతదేశపు అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ZEE5, తాజాగా తన తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ తో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్, విడుదలైన కొద్ది రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటుతూ బంపర్ హిట్‌గా నిలిచింది. ఉత్కంఠ భరితమైన కథ, శక్తివంతమైన నటనతో ఆడియెన్స్ ను అలరిస్తూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇక ఈ విజయంపై వెనకడుగు వేయకుండా, ZEE5 తాజాగా మరో క్రేజీ అప్డేట్ ప్రకటించింది. ఇటీవల థియేటర్లలో ఘన విజయం సాధించిన ‘భైరవం’ త్వరలోనే ZEE5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతం ట్రెండ్‌లో కొనసాగుతున్న విరాటపాలెం సిరీస్ ను కృష్ణ పోలురు దర్శకత్వం వహించగా, కెవి శ్రీరామ్ నిర్మించారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. కథాంశం ప్రకారం, 1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని విరాటపాలెం అనే గ్రామంలో ప్రతి పెళ్లికూతురు తన వివాహ దినానే చనిపోతుంటుంది. దీన్ని గ్రామస్తులు శాపంగా భావించి భయంతో వణికిపోతారు. దాదాపు పదేళ్ల పాటు ఆ గ్రామంలో ఒక్క పెళ్లి కూడా జరగని పరిస్థితి నెలకొంటుంది.
Read This also…Hari Hara Veera Mallu’ Trailer Creates Sensation! Pawan Kalyan’s Power-Packed Action
ఇది కూడా చదవండి…హరిహర వీరమల్లు’ ట్రైలర్ సంచలనం! పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్..
అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి పోలీస్ కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) రాగా, ఆ గ్రామ శాపం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ధైర్యంగా అడుగు పెట్టుతుంది. ఇది నిజంగానే శాపమా? లేక ఎవరైనా చేస్తున్న హత్యలేనా? అనే సస్పెన్స్‌తో సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
జూన్ 26న ప్రీమియర్ అయిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్ విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ZEE5లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నాణ్యమైన ఒరిజినల్ కంటెంట్‌ను అందించడంలో ZEE5 నిలబడ్డ మరో ఉదాహరణగా దీనిని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ZEE5లో ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘భైరవం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పక చూడండి!