Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 27 ఆగస్ట్ 2024: భారతదేశంలోని ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) శ్రీ సిటీ ఇంధన అవసరాలను పునరావిష్కరించటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తిస్తూ , సమగ్ర గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ను అభివృద్ధి చేయటం ప్రారంభించింది.

శ్రీ సిటీలోని పారిశ్రామిక, వాణిజ్య, నివాస రంగాలకు ఆధారపడతగిన , తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ అనుకూల సహజ వాయువు (Natural Gas) ఆత్మాభ్యలను అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. శ్రీ సిటీ ,ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) నిబద్ధతను తెలియపరుస్తుంది.

ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham )శ్రీ సిటీ మధ్య ఈ సంవత్సరం మార్చిలో అవగాహన ఒప్పందం జరిగింది. సమగ్ర వ్యాపార రంగంలో భవిష్యత్తులో రాబోయే కస్టమర్‌లను అనుసంధానించే విధంగా సమగ్ర సహజ వాయువు (Natural Gas) పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను రూపొందించడంపై దృష్టి సారించిన బలమైన భాగస్వామ్యాన్ని ఇది సూచిస్తుంది.

ఈ భాగస్వామ్యం శ్రీ సిటీలోని పరిశ్రమలకు తమ ఉద్యోగుల రవాణా వాహనాలను కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)కి మార్చడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఒక విలువైన అవకాశాన్ని అందిస్తుంది.

ఈ భాగస్వామ్యం పై ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అభిలేష్ గుప్తా గారు మాట్లాడుతూ, “ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు నమ్మకమైన ఇంధన పరిష్కారాన్ని అందించే సహజ వాయువు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి శ్రీ సిటీతో భాగస్వామ్యం చేసుకోవటానికి మేము సంతోషిస్తున్నాము.

భవిష్యత్తులో రాబోయే నూతన పారిశ్రామిక సంస్థలను సజావుగా కనెక్ట్ చేసే విదంగా సమగ్ర గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో ఇంధన ల్యాండ్‌స్కేప్‌ను మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ అసోసియేషన్ గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.

మెటల్, ఆటోమోటివ్, సిరామిక్స్/గ్లాస్, ప్యాకేజింగ్,పాల ఉత్పత్తి రంగాలతో సహా ఈ పారిశ్రామిక వాడలోని పరిశ్రమలు ఈ భాగస్వామ్యం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందగలవు. రాబోయే 5 సంవత్సరాలలో రూ. 3,500 కోట్ల పెట్టుబడిని ప్రణాళిక చేశాము.

దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న వినియోగదారులందరికీ పర్యావరణ అనుకూలమైన,ఆర్థిక పరంగా అందుబాటులోని ఇంధనం అయిన సహజ వాయువుకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.

శ్రీ గౌతమ్ ఆనంద్ గారు, రీజినల్ హెడ్ – ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ), నెల్లూరు, చిత్తూరు,తిరుపతి, వారు ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) అభిప్రాయాలను వెల్లడిస్తూ ” ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) తిరుపతి, చిత్తూరు, SPSR నెల్లూరు, YSR కడప అన్నమయ్య, శ్రీ సత్యసాయి.

అనంతపురంతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తోంది. మేము ఇప్పటికే 3 లైవ్ LCNG స్టేషన్‌లతో సహా 56 CNG స్టేషన్‌లను ప్రారంభించాము.

ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) 46,000 కంటే ఎక్కువ గృహాలను కనెక్ట్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3,350 అంగుళాల-కిమీ కంటే ఎక్కువ పైప్‌లైన్‌లను వేసింది” అని అన్నారు.

శ్రీ గౌతమ్ ఆనంద్ గారు మాట్లాడుతూ ” శ్రీ సిటీ లో CNG ను పర్యావరణ అనుకూల మొబిలిటీ పరిష్కారంగా పరిచయం చేస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. పారిశ్రామిక పార్క్ లోపల మా ప్రతిపాదిత CNG ఇంధన స్టేషన్ శ్రీ సిటీ రవాణా అవసరాలను తీర్చనుంది.

పరిశ్రమలు తమ పర్యావరణ, సామాజిక,పాలన (ESG) లక్ష్యాలను సాధించడంలో సహాయపడనుంది. దీనితో పాటుగా, శ్రీ సిటీలోని రెసిడెన్షియల్ సొసైటీలు గృహ అవసరాల కోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ప్రయోజనాలను కూడా పొందుతారు, నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సమాజం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది..” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా సహజవాయువును స్వచ్ఛమైన,స్థిరమైన ఇంధన వనరుగా ప్రోత్సహించాలనే ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham ) లక్ష్యం కు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యింది.

శ్రీ సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం.పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం అనే విస్తృత లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుంది.

error: Content is protected !!