365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: రేపు, ఎల్లుండి జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సూచించారు. మహిళా రైతులు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈరోజు ఉదయం వ్యవసాయ కార్యదర్శి, APC M. రఘునందన్ రావు IAS , కమిషనర్ B. గోపి IAS లతో కలిసి మంత్రి రాజేంద్రనగర్ లోని PJTAU స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆడిటోరియంను పరిశీలించారు. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు జరుగుతున్న ఏర్పాట్లను మంత్రికి వివారించారు.
కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకి ఉపయోగపడేలా, ఆవరణలో అనువైన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.
గవర్నర్,విశ్వవిద్యాలయ కులపతి గౌరవ జిష్ణు దేవ్ వర్మ, గౌరవ ముఖ్య మంత్రి A. రేవంత్ రెడ్డి, పర్యటన, ప్రసంగ కార్యక్రమాల్లో సమయపాలన పాటించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.