365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 8,2026: దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అర్హత కల్పించే ‘ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్’ (AIBE XX) ఫలితాలు విడుదలయ్యాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) బుధవారం రాత్రి ఈ ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 30న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 2.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 1.74 లక్షల మంది (69.21%) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

తొలగించిన ప్రశ్నలివే.. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన మానిటరింగ్ కమిటీ, మొత్తం 5 ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించింది. దీంతో తుది ఫలితాలను 100 మార్కులకు బదులుగా 95 మార్కులకు లెక్కించారు. అలాగే రెండు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా గుర్తించి, ఆ రెండింటిలో ఏది గుర్తించినా పూర్తి మార్కులు కేటాయించారు.

ఇదీ చదవండి:శుభ్‌మన్ గిల్ అందుకే స్పెషల్ .. అభిషేక్ శర్మతో పోలుస్తూ యువరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇదీ చదవండి:శ్రీలంక గడ్డపై పాకిస్థాన్ ఘన విజయం.. !

అర్హత మార్కులు: మొత్తం 95 మార్కులను ప్రాతిపదికగా తీసుకున్నందున క్వాలిఫైయింగ్ మార్కుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

జనరల్/OBC అభ్యర్థులు: 43 మార్కులు (45 శాతం)

SC/ST/PwD అభ్యర్థులు: 38 మార్కులు (40 శాతం)

ఫలితాలను చూడండిలా: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com లో తమ లాగిన్ వివరాలు (రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్) నమోదు చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణత సాధించిన వారికి త్వరలోనే ‘సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్’ (CoP) జారీ చేయనున్నట్లు బీసీఐ తెలిపింది.

తదుపరి పరీక్ష షెడ్యూల్: ఫలితాలతో పాటు తదుపరి ఏఐబీఈ-21 (AIBE XXI) పరీక్ష తేదీని కూడా బీసీఐ ప్రకటించింది. ఈ పరీక్షను జూన్ 7, 2026న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో దక్షిణాదిలోనే మొట్టమొదటి ‘ఫిన్నిష్’ స్కూల్ ప్రారంభం..

Read this also:New Finnish-Model International School Debuts in Hyderabad..

aibe result
aibe 20 result 2025
all india bar examination
aibe result 2025
aibe 20 result
aibe exam
all india bar examination results
aibe 20
aibe xx result
bar council of india
aibe result 2026
allindiabarexamination.com result
aibe results
aibe exam 2025
aibe xx result 2025
aibe 2025 result