365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 10, 2026: దేశాభివృద్ధిలో వృత్తి నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ‘ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్’ (ఏఐపీసీ) జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం భాగ్యనగరంలో ఘనంగా జరిగింది. “ఆకాంక్షల రాజకీయాలకు ఊపిరిపోద్దాం” (Fostering a Politics of Aspiration) అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల నిపుణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిపుణుల మేధోమథనం..
ఏఐపీసీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2025లో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, 2026 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, సామాన్యుల ఆకాంక్షలకు గౌరవం కల్పించేలా, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో చర్చించిన కీలక అంశాలు ఇవే ..
ఆర్థిక రంగం..పారదర్శకమైన ఆర్థిక విధానాలు, మధ్యతరగతి ప్రయోజనాలు.
సాంకేతికత, ఐటీ..డిజిటల్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు.
ఇదీ చదవండి:నవ్వుల ‘మిత్ర మండలి’.. తారల ‘సంక్రాంతి అల్లుళ్లు’.. ఆదివారం మీ జీ తెలుగులో!
Read this also:Zee Telugu’s Sankranthi Double Treat: ‘Mithra Mandali’ Premiere & Star-Studded Gala..
వ్యవసాయం,ఎంఎస్ఎంఈ..గ్రామీణ ఉపాధి, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం.
సామాజిక హక్కుల పరిరక్షణ..గిగ్ వర్కర్లు, ఎల్జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) వర్గాల హక్కులు, పర్యావరణ పరిరక్షణ.
ఇదీ చదవండి:బంగాళాఖాతంలో ముదురుతున్న ముప్పు.. ఏపీపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్..
ఇదీ చదవండి:‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. !
ముఖ్య అతిథిగా మంత్రి అజహరుద్దీన్..

ఈ కార్యక్రమానికి తెలంగాణ మైనారిటీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నిపుణులతో ముఖాముఖి నిర్వహించి, నాయకత్వ లక్షణాలు, సుపరిపాలనపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్‌లో నిపుణుల హవా..
ఏఐపీసీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పలువురు నేతలు కీలక పదవుల్లో రాణించడంపై సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఖాలిద్ (హైదరాబాద్), దీపక్ జాన్ (సికింద్రాబాద్) లు తమ అనుభవాలను నిపుణులతో పంచుకున్నారు.
అలాగే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ఏఐపీసీ సభ్యులు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తమ రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. తెలంగాణ ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆదిత్య రెడ్డి గిల్లేళ్ల మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్యాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసంధానం చేయడమే ఏఐపీసీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
