365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్ట్ 1,2024:ఈ విమానయాన సంస్థ 3 సెప్టెంబర్ 2024 నుంచి 6 డైరెక్ట్ విమానాల చొప్పున ఢాకాను కోల్‌కతా, చెన్నైలతో కలపనుంది
తమ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తూ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఢాకాకు తమ కార్యకలాపాల విస్తరించినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 3, 2024 నుంచి , ఎయిర్‌లైన్ సంస్థ ఢాకాను కోల్‌కతా,చెన్నైలతో కలపనుంది.

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటుగా ఆర్థిక వృద్ధిని సైతం పెంపొందిస్తూ ప్రతి నగరానికి ఆరు చొప్పున వీక్లి విమానాలను నడుపనుంది.
ఢాకాకు బయలుదేరే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో బుకింగ్ కోసం ఎయిర్ లైన్ అవార్డు గెలుచుకున్న వెబ్ సైట్ airindiaexpress.com, మొబైల్ యాప్,ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్‌లలో బుకింగ్ లు తెరువబడ్డాయి.
ఈ మార్గాలలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్ ధరలు ఎయిర్లైన్స్ వెబ్ సైట్ లో లభ్యమవుతున్నాయి. ఈ పరిచయ చార్జీలు : కోల్‌కతా-ఢాకా రూ. 3443, ఢాకా-కోల్‌కతా రూ. 4609, చెన్నై-ఢాకా రూ. 4796,ఢాకా-చెన్నై రూ. 7223.

Scheduled from September 3, 2024 | ||||
Departure | Arrival | Departure Time | Arrival Time | Frequency |
Kolkata | Dhaka | 11:55 | 13:30 | Tuesday to Sunday |
Dhaka | Kolkata | 23:10 | 23:45 | Tuesday to Sunday |
Chennai | Dhaka | 19:00 | 22:10 | Tuesday to Sunday |
Dhakka | Chennai | 14:30 | 16:50 | Tuesday to Sunday |
ఈ ప్రారంభం గురించి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ, “కోల్‌కతా ,చెన్నై నుంచి ఢాకాకు డైరెక్ట్ విమానాలను పరిచటం చేయటంతో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భారత ఉపఖండం అంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
ఈ కొత్త మార్గాలు భారతీయ ఆతిథ్యం, ఆత్మీయత తో మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవటం తో పాటుగా ప్రాంతీయ సంబంధాలను మరింతగా బలోపేతం చేయనున్నాయి. ఉపఖండం లోపల మరిన్ని అవకాశాలను తెరువనున్నాయి.

వాణిజ్యం, పర్యాటకం మాత్రమే కాకుండా , ఈ విమానాలు బంగ్లాదేశ్ నుండి చెన్నై , కోల్‌కతాలో స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సల కోసం వచ్చే వారికి కూడా సహాయపడతాయి.
ఈ సర్వీస్ లు గల్ఫ్ ప్రాంతానికి , అలాగే ఎయిర్ ఇండియా సుదూర అంతర్జాతీయ విమానాలకు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు కనెక్షన్‌ను అందిస్తాయి” అని అన్నారు.
బాగ్డోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, ఇంఫాల్, జైపూర్, సూరత్ మరియు వారణాసి వంటి నగరాల నుంచి వచ్చే అతిథులు ఇప్పుడు ఢాకాకి అనుకూలమైన వన్-స్టాప్ కనెక్టివిటీ నుంచి ప్రయోజనం పొందుతారు.
ఢాకా నుంచి అతిథులు ఇప్పుడు కోల్‌కతా లేదా చెన్నై మీదుగా ఈ నగరాలకు సులభంగా ప్రయాణించవచ్చు.
ఢాకాకు ఈ నెట్‌వర్క్ విస్తరణతో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు మూడవ-అతిపెద్ద స్టేషన్‌గా కోల్‌కతా అవతరించింది, సిటీ ఆఫ్ జాయ్‌ను నేరుగా 13 గమ్యస్థానాలకు మరియు 20 గమ్యస్థానాలకు వన్-స్టాప్ ప్రయాణాల ద్వారా కలిపే 158 వీక్లి విమానాలను అందిస్తోంది.
చెన్నై నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 13 గమ్యస్థానాలను నేరుగా మరియు 24 గమ్యస్థానాలను వన్-స్టాప్ ప్రయాణాల ద్వారా కలుపుతూ 85 కు పైగా వీక్లివిమానాలను నడుపుతోంది.

గత వారం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన 32వ దేశీయ గమ్యస్థానంగా అగర్తలాను ప్రకటించింది, త్రిపుర రాజధాని నగరం నుంచి కోల్‌కతా, గౌహతికి రోజువారీ నేరుగా విమానాలను నడుపుతుంది .
ఎయిర్‌లైన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో బుకింగ్ చేసే లాయల్టీ సభ్యులు అదనపు రివార్డ్‌లు, ప్రయోజనాలను పొందుతారు, ఇందులో 8% వరకు ప్రత్యేక తగ్గింపులు ,ప్రత్యేక డీల్‌లు, 8% NeuCoins,కాంప్లిమెంటరీ ఎక్స్‌ప్రెస్ అహెడ్ ప్రయారిటీ చెక్-ఇన్, బోర్డింగ్ ,బ్యాగేజ్ సేవలు ఉన్నాయి.
లాయల్టీ సభ్యులతో పాటు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, SMEలు ,డిపెండెంట్లు,భారత సాయుధ దళాల సభ్యులు airindiaexpress.comలో ప్రత్యేక ఛార్జీలు ,ప్రయోజనాలను పొందవచ్చు.
విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎక్స్‌ప్రెస్ లైట్, ప్రత్యేక క్యాబిన్ సామాను మాత్రమే ఛార్జీలను కూడా బుక్ చేసుకోవచ్చు.