Mon. Dec 23rd, 2024
air-india-fligh_365T

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్, జనవరి 4, 2023: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఓ వృద్ధురాలుపై ఓ ప్రబుద్దుడు మూత్ర విసర్జన చేశాడు.

మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, ఫిర్యాదు చేసినా ఎయిర్ ఇండియా సిబ్బంది అతనిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఆమె. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, నిందితుడిపై ఎయిర్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో అతన్ని ‘నో ఫ్లై లిస్ట్’లో చేర్చమని సిఫార్సు చేసింది.

air-india-fligh_365T

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నఉద్యోగులు..

మహారాష్ట్రలోని మూడు ప్రభుత్వ విద్యుత్ సంస్థల వేలాది మంది ఉద్యోగులు నేటి నుంచి 72 గంటల పాటు సమ్మెకు దిగారు. ఈ కంపెనీల ప్రైవేటీకరణను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.

సమ్మెను ఆపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ (మెస్మా)ను ప్రయోగించింది. మెస్మా ప్రభావం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సాధారణ విద్యుత్ సరఫరాను పునరుద్ధ రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

error: Content is protected !!