365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 21, 2025: సెప్టెంబర్ 2024లో తమ ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్‌ను ప్రవేశపెట్టి ఇప్పటికే 27.5 బిలియన్లకుపైగా స్పామ్ కాల్స్‌ను గుర్తించి కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్టెల్, ఇప్పుడు మరింత శక్తివంతమైన రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఇప్పటి నుంచి ఎయిర్టెల్ వినియోగదారులు తమకు ఇష్టమైన భారతీయ భాషల్లోనే స్పామ్ కాల్స్ ,ఎస్ఎంఎస్లకు హెచ్చరికలు పొందగలుగుతారు. ప్రారంభానికి పదిహేను ప్రాంతీయ భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో మరిన్ని భాషలను జోడించనుంది.
అలాగే, ఇప్పటివరకు దేశీయ నెట్‌వర్క్‌లకు మాత్రమే పరిమితంగా ఉన్న స్పామ్ స్కానింగ్ టూల్‌ను, ఇప్పుడు అంతర్జాతీయ నంబర్ల నుండి వచ్చే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు విస్తరించింది.
Read this also…Airtel Expands AI-Powered Anti-SPAM Features with Regional Language Alerts and International Call Filtering
ఇది కూడా చదవండి...7000 mAh పెద్ద బ్యాటరీ’సూపర్ బ్రైట్’ డిస్ప్లేతో Oppo K13 5G లాంచ్..
ఇటీవల దేశీయ నంబర్లపై నియంత్రణ పెరిగిన తర్వాత, మోసగాళ్లు విదేశీ నెట్‌వర్క్‌లను ఉపయోగించి భారత వినియోగదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనే ధోరణి కనిపించింది. ఈ ధోరణి వల్ల గత ఆరు నెలల్లో విదేశీ స్పామ్ కాల్స్‌లో 12% పెరుగుదల కనిపించింది. ఈ సమస్యను అడ్డుకునేందుకు ఈ కొత్త ఫీచర్ కీలకం కానుంది.

ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ మార్కెటింగ్ డైరెక్టర్,కనెక్టెడ్ హోమ్స్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ మాట్లాడుతూ –“మా వినియోగదారులు చెప్పే ప్రతీ మాట మాకు ముఖ్యం. వారి అభిప్రాయాల ఆధారంగా భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తూ, మరింత సౌలభ్యంగా స్పామ్ హెచ్చరికలను అందించేందుకు ఈ భాషల ఫీచర్‌ను తీసుకొచ్చాము.
అంతేగాక, విదేశీ నెట్‌వర్క్‌ల ద్వారా వచ్చే స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌ను గుర్తించేందుకు మా ఏఐ టూల్‌ను విస్తరించాం. మా ఇంజనీర్లు, డేటా సైంటిస్టుల బృందం నిరంతరం టూల్‌ను మెరుగుపరుస్తూ వినియోగదారుల రక్షణకు ముందుండనుంది,” అని తెలిపారు.
ప్రస్తుతం ఈ స్పామ్ అలర్ట్ ఫీచర్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ భాషలలో స్పామ్ అలర్ట్స్ ను కేవలం Android ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు మాత్రమే పొందగలుగుతారు. ఈ సేవ పూర్తిగా ఉచితం ,ఎయిర్టెల్ వినియోగదారులకు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది – అందుకు ఎటువంటి ప్రత్యేక అభ్యర్థన అవసరం లేదు.
ఇది కూడా చదవండి...DARE కార్యదర్శిగా, ICAR DGగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంగి లాల్ జాట్
Read this also…Dr. Mangi Lal Jat assumes charge as Secretary of DARE and Director General of ICAR
సెప్టెంబర్ 2024లో ప్రారంభమైన ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ టూల్ ఇప్పటివరకు 27.5 బిలియన్ స్పామ్ కాల్స్‌ను గుర్తించి, ప్రతి సెకనుకు సగటున 1560 స్పామ్ కాల్స్‌ను హెచ్చరిస్తోంది. ఈ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఎయిర్టెల్ వినియోగదారులు స్పామ్ కాల్స్‌లో 16% తగ్గుదలను చూసారు.