
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 29,2021: రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకునే ఒక ఉద్యోగం కాదు. నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ సరైన పరిష్కారమార్గాలు చూపించేవాడే ప్రజానాయకుడు.. ప్రజాబంధువు..ప్రజలమధ్య ఉంటూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ చిన్నప్పటినుంచే ప్రజాభిమానాన్ని పొందాడు నవతరం లీడర్ తోటకూర అజయ్ యాదవ్. ప్రజలకు సేవలందించాలని సంకల్పమే అతన్ని ప్రజాప్రతినిధిగా మార్చింది. ఆ సంకల్పమే.. అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నది.. అపోజిషన్ లీడర్లకు ముచ్చెమటలు పెట్టిస్తున్నది .. నవతరం నాయకుడు ఇలా ఉండాలనేలా రాజకీయాల్లో.. తోటకూర అజయ్ యాదవ్ తనదైన ముద్రవేస్తున్నాడు. నవతరం ఐకానిక్ పొలిటీషన్ తోటకూర అజయ్ యాదవ్ పై “365తెలుగు డాట్ కామ్” ప్రత్యేక కథనం…
ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించే నవతరం లీడర్…

నవతరం ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించే ఓ లీడర్ కావాలని కోరుకున్న బోడుప్పల్ 6వ డివిజన్ ప్రజలకు వరంలా దొరికాడు తోటకూర అజయ్ యాదవ్. ఇంకేం ఏరికోరి కార్పోరేటర్‌గా గెలిపించుకున్నారు. చిన్నవయసులోనే గెలిచిన ఈ కార్పోరేటర్ డివిజన్ అభివృద్ధికి పాటుపడుతున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అజయ్ యాదవ్ తల్లిదండ్రులు తోటకూర వజ్రెష్ యాదవ్ – లక్ష్మి. తల్లి లక్ష్మి.. గతంలో బోడుప్పల్ సర్పంచ్‌గా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొందారు. ఇక అజయ్ తండ్రి వజ్రెష్ యాదవ్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చేదోడువాదోడుగా ఉంటూ పార్టీకి పునర్‌వైభవం తెచ్చే క్రమంలో వజ్రెష్ తనదైన పాత్ర నిర్వహిస్తున్నారు.
చిన్నవయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి…

తల్లిదండ్రుల తరహాలోనే అజయ్ యాదవ్ చిన్నవయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలు తీర్చుతున్నారు. ఆప్తమిత్రుడిలా అందరి మనసు దోచుకుంటున్నారు. బోడుప్పల్ పరిధిలోని కొన్ని సర్వే నంబర్‌లలో భూములున్నాయని ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లు నిలిపివేసిందని దాంతో సుమారు 5వేల కుటుంబాలు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తన గళం గట్టిగా వినిపించారు. ప్రజల జీవితాలు గాల్లో కలుస్తున్నాయంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎప్పటికప్పుడు కౌన్సిల్ మీటింగ్‌లో తన గళాన్ని వినిపిస్తూ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ యంగ్ లీడర్. చిన్నవయసులోనే కార్పొరేటర్‌గా గెలిచిన అజయ్ యాదవ్.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫాలోఫర్ గా, తనదైన శైలిలో ఈ తరం రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇదే క్రమంలో అజయ్ యాదవ్.. రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉన్నలీడర్‌గా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తనదైన ముద్రవేయాలని ఆశిద్దాం.
