365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 28,2025: 2025 జనవరి 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్ సాగర్లో పడిపోయిన అజయ్ మృతదేహాన్ని DRF హైడ్రా బృందాలు మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బయటకు తీశాయి. అజయ్ (వయస్సు సుమారు 20 సంవత్సరాలు) ఈసీఐఎల్ హనుమాన్ టెంపుల్ లైన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
ఆదివారం నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించిన “భారత మాత మహా హారతి” కార్యక్రమంలో బోటు నుంచి టపాసులు పేల్చడం జరుగుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ప్రమాదం నుంచి బయటపడే ప్రయత్నంలో అజయ్ గల్లంతైనాడు.

తర్వాత, హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం DRF, NDRF, ఫైర్ సర్వీస్ బృందాలు జాయింట్‌గా గాలింపు చేపట్టాయి. మంగళవారం సాయంత్రం, అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే అజయ్ మృతదేహం కనుగొనబడిందని DRF బృందాలు వెల్లడించాయి.
ఈ ఘటన స్థానిక ప్రజలను కలచివేసింది. అధికారుల వెంటనే స్పందనకు కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మరింత భద్రతా చర్యలు అవసరమని ప్రజలు అభిప్రాయపడ్డారు.