365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి,జనవరి 28,2026: మహారాష్ట్ర రాజకీయ యవనికపై ‘పవార్’ అన్న పేరు ఒక బ్రాండ్. దశాబ్దాల కాలం పాటు అజేయ శక్తిగా నిలిచిన శరద్ పవార్‌.. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు అజిత్ పవార్‌ను తీర్చిదిద్దారు. కానీ, నేడు అదే బాబాయ్-అబ్బాయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ యుద్ధం నడుస్తోంది. కుటుంబ అనుబంధం ఒకవైపు, అధికార కాంక్ష మరోవైపు వెరసి పవార్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది.

వారసుడిగా ఎదిగి.. తిరుగుబాటు బావుటా ఎగురవేసి!
శరద్ పవార్ నీడలో రాజకీయ పాఠాలు నేర్చుకున్న అజిత్ పవార్, అనతి కాలంలోనే ఎన్సీపీ (NCP)లో బలమైన నేతగా ఎదిగారు. క్షేత్రస్థాయిలో కేడర్‌పై పట్టు సాధించడంలో అజిత్ విజయవంతమయ్యారు. అయితే, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతోందని, సుప్రియా సూలే వైపు బాబాయ్ మొగ్గు చూపుతున్నారనే అసంతృప్తి అజిత్ పవార్‌లో అగ్నిలా రాజుకుంది.

ఇదీ చదవండి..అజిత్ పవార్ విమానం కూలడానికి ముందు పైలట్ చేసిన చివరి హెచ్చరిక ఇదే..

Read this also..“Baramati Learjet Tragedy: 26-Year-Old First Officer Shambhavi Pathak Among Five Victims”

కీలక మలుపులు..

అకస్మాత్తు ప్రమాణం: 2019లో తెల్లవారుజామునే బీజేపీతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం పవార్ల మధ్య విబేధాలను బహిర్గతం చేసింది.

పార్టీ చీలిక.. 2023లో ఏకంగా మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరడం.. గురువుకే షాక్ ఇచ్చేలా పార్టీ పేరును, గుర్తును చేజిక్కించుకోవడం రాజకీయ సంచలనంగా మారింది.

నువ్వా-నేనా?.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అన్నట్లుగా సాగిన ప్రచారం.. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాన్ని ప్రస్ఫుటం చేసింది.

ఇదీ చదవండి..రెపో రేటును తగ్గించనున్న ఆర్బీఐ.. తగ్గనున్న హోమ్ లోన్ ఈఎంఐలు..!

Read this also..RBI Likely to Cut Repo Rate by 0.25% in February..

విడదీయలేని బంధం.. వీడని స్పర్థలు..!

ప్రజా వేదికలపై ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ప్పటికీ, వ్యక్తిగత సందర్భాల్లో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంటారు. అయినప్పటికీ, అధికారికంగా మాత్రం శరద్ పవార్ ‘అసలైన ఎన్సీపీ నాదే’ అని పోరాడుతుంటే, అజిత్ పవార్ ‘కాలం మారింది.. కొత్త తరం రావాలి’ అంటూ తన వాదన వినిపిస్తున్నారు.

“రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు.. కానీ పవార్ కుటుంబంలో జరిగిన ఈ చీలిక మాత్రం మరాఠా రాజకీయ చరిత్రలో ఒక తీరని మచ్చని రాజకీయ విశ్లేషకులు భవిస్తున్నారు.

అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం..ఒక శకం ముగిసింది. శూన్యం నుంచి తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అజిత్ పవార్, పవార్ కుటుంబంలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగారు. కుటుంబ నేపథ్యం..శరద్ పవార్ సోదరుడు అనంతరావు పవార్ కుమారుడైన అజిత్, బాబాయ్ అడుగుజాడల్లో నడిచి రాష్ట్ర రాజకీయాలను శాసించారు.

పట్టున్న నేత..ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. సహకార రంగంపై, ముఖ్యంగా చక్కెర బెల్ట్‌పై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది.

అనుబంధాలు..రాజకీయంగా విభేదించినా.. ఫడ్నవీస్, ఏకనాథ్ షిండేలతో ఆయనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఆయన మరణంతో మహారాష్ట్ర ఒక పరిపాలనా దక్షుడిని కోల్పోయింది.