365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చెన్నై, ఏప్రిల్15, 2025: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ వైపు దూసుకెళ్తోంది.

అధిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ మాస్ మూవీ, తమిళనాడులో రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్‌తో హవాను చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆకట్టుకుంటోంది. కర్ణాటక, కేరళతో పాటు విదేశీ మార్కెట్లలో రూ. 50 కోట్లకు పైగా రాబట్టిందని ట్రేడ్ సమాచారం.

Read this also…“Villa Verde: The Ultimate Luxury Villa Experience by CyberCity Builders & Developers at Green Hills Road, Hitec City”

ఇది కూడా చదవండి..అట్లాంటా(TAMA)లో ఉగాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జో శర్మ

మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో త్రిష, అర్జున్ దాస్, యోగి బాబు, రాహుల్ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇతర ముఖ్య పాత్రల్లో చేశారు. జీవీ ప్రకాష్ సంగీతం, సుప్రీమ్ సుందర్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

అజిత్ రెడ్ డ్రాగన్ అనే గ్యాంగ్‌స్టర్‌గా, తన కొడుకు జీవితాన్ని కాపాడేందుకు మళ్లీ రౌడీయిజంలోకి రీఎంట్రీ ఇచ్చే కథాంశం ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. అజిత్ మాస్ లుక్, డైలాగ్ డెలివరీ, స్టైలిష్ ఫైట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం మరిన్ని వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీగా ఉంది.

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిలిచింది. తమిళ నూతన సంవత్సరం సెలవులతో మరింత జోరుగా థియేటర్లలో జనం రాక ఉంటుందని అంచనా. 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటే, అజిత్ కెరీర్‌లో ఇది తొలి చిత్రంగా చరిత్ర సృష్టించనుంది.

అజిత్ తదుపరి సినిమాపై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. అధిక్‌తో మరో ప్రాజెక్ట్ లేదా కార్తీక్ సుబ్బరాజ్, ప్రశాంత్ నీల్‌లతో కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో అజిత్ మాస్ జాతర బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేస్తోంది!