Sun. Dec 22nd, 2024
megastar-chiru
megastar-chiru

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జూలై 20,2022: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చిరంజీవి ఫ్యాన్స్ నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలను అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు తీవ్రంగా ఖండించారు. “నారాయణ గారు మీరు చిరంజీవి గారిని అనవసరంగా దూషించడం సరికాదని” చెప్పారు.

Ravanam Swami naidu@swaminaidu_r·1h#CPI Narayana expressed his apologize to our #MegastarChiranjeevi@KChiruTweets664198

https://twitter.com/swaminaidu_r?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor

megastar-chiru

“మీకు నచ్చిన వారిని కార్యక్రమానికి ఆహ్వానించ లేదనే అక్కసుతో.. మెగాస్టార్ చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. చిరంజీవి గారిని కేంద్ర మాజీ మంత్రి హోదాలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పిలిచారని” అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు వెల్లడించారు. మీరు ఇలా మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు.

https://www.instagram.com/swaminaidu_ravanam/?igshid=1dwwrme23x3mu

https://twitter.com/swaminaidu_r?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor

megastar-chiru

మీరు ఏమిటో… చిరంజీవి గారు ఏమిటో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తెలుసు..అని రవణం స్వామినాయుడు పేర్కొన్నారు. ఇప్పటికైనా చిరంజీవి గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఓ ప్రకటనలో కోరారు.

error: Content is protected !!