Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic worldExperts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world
Almond Board of California Virtual Discussion Program on Lifestyle
Almond Board of California Virtual Discussion Program on Lifestyle

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జూలై 23, 2021:అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా వర్ట్యువల్‌ ప్యానెల్‌ చర్చా కార్యక్రమాన్ని ‘మహమ్మారి అనంతర ప్రపంచంలో వేగంగా మారుతున్నజీవనశైలి వేళ కుటుంబ ఆరోగ్యం పొందడంలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించింది. భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహార,జీవనశైలి పరంగా తప్పనిసరిగా చేసుకోవాల్సిన మార్పులను గురించి చర్చించిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌, మ్యాక్స్‌హెల్త్‌కేర్‌–ఢిల్లీ, రీజనల్‌ డైటెటిక్స్‌ హెడ్‌ -రితికా సమద్ధార్‌ ; న్యూట్రిషియనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి ; అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా గ్లోబల్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఎమిలీ ఫ్లీష్మాన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌జె షెజ్జీ మోడరేటర్‌గా వ్యవహరించారు.

మన చుట్టూ ఉన్న ప్రపంచం అత్యంత వేగంగా మారుతుండటమే కాదు, అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లపై అనిశ్చితి కూడా కొనసాగుతుంది. సరైన కుటుంబ ఆరోగ్యం నిర్వహించడం అనేది ఎన్నో భారతీయ కుటుంబాలు తాము దృష్టి కేంద్రీకరించిన అత్యంత కీలకాంశాలలో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే, ప్రతివ్యక్తి నియంత్రణలోనే ఇది ఉంటుంది. పౌష్టికాహార, సమతుల్యమైన ఆహారం మాత్రమే చక్కటి ఆరోగ్యంకు తోడ్పాటునందిస్తుందన్నది భావన మాత్రమే కాదు ఎన్నో సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న అంశం కూడా! ఏది తినాలి, ఏది తినకూడదు అనే అంశాలు తరచుగా ప్రధాన వార్తా శీర్షికలలో కనిపిస్తుంటాయి. సాధారణంగా వినియోగదారులు మరీ ముఖ్యంగా మాతృమూర్తులు శాస్త్రీయ సలహాలను, ధోరణులను తమ సొంత పాకశాస్త్ర నమ్మకాలు, ప్రాచుర్యం పొందిన సంప్రదాయాలు, వంటకాలు, స్థానికంగా లభించే ఆహారంతో మిళితంచేయడానికి ప్రయత్నిస్తుంటారు.

Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world
Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. ఎంతోమంది భారతీయులు తమ జీవితాలను మార్చుకోవడంతో పాటుగా మహమ్మారి అనంతర ప్రపంచంలో సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను అందిస్తూనే, కోలుకోవడానికి అనుసరించాల్సిన పలు మార్గాలను గురించి చర్చించడం ,కుటుంబంలో ప్రతి సభ్యుని ఆరోగ్యం పట్ల అధికంగా ఆప్రమప్తత చూపాల్సిన ఆవశ్యకతను కూడా తెలిపింది. ఈ చర్చలో ప్యానలిస్ట్‌లు పలు ఉదాహరణలను వెల్లడించడంతో పాటుగా తమ వ్యక్తిగత జీవితాలలో ఎదురైన అనుభవాలను గురించి కూడా తెలుపుతుతూ భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలు తమ ఆరోగ్యం, జీవనశైలి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను తెలిపారు.

Almond Board of California Virtual Discussion Program on Lifestyle
Almond Board of California Virtual Discussion Program on Lifestyle

కుటుంబంలోని ప్రతి వ్యక్తి రోగ నిరోధక శక్తి మెరుగుపరచడంతో పాటుగా జీవనశైలివ్యాధులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన అత్యుత్తమ పోషకాలను గురించి ఈ చర్చా కార్యక్రమంలో నొక్కి చెప్పడంతో పాటుగా పౌష్టికాహారానికి ప్రాధాన్యతనిచ్చుకోవాల్సిన ఆవశ్యకతను సైతం తెలిపారు. బాదములు లాంటి ఆహారాన్ని డైట్‌లో జోడించుకోవడం గురించి వీరు తెలిపారు. ఈ చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్‌లు మరింత సమగ్రమైన విధానంలో తమ ఆరోగ్యం పట్ల అప్రమప్తతతో వ్యవహరించాల్సిన అవసరం గురించి తెలుపుతూనే భారీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్క అంశాన్నీ వేర్వేరుగా చేయాల్సిన అవసరమూ తెలిపారు. ఈ క్రమంలోనే, ప్యానలిస్ట్‌లు సమగ్రమైన డైట్‌తో పాటుగా తరచుగా వ్యాయామాలు చేయడం, ఆలోచనాత్మకంగా స్నాక్స్‌ తీసుకోవడం గురించి కూడా వెల్లడించారు. అదే సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలను చేయాల్సిన ఆవశ్యకతనూ వెల్లడించారు. దీర్ఘకాలంలో, ఈ అంశాలన్నీ కూడా కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన ఆరోగ్యం అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world
Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world

ఈ చర్చ సమయంలో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘ నేటి ప్రపంచంలో, మాతృమూర్తిగా బాధ్యతలను నిర్వర్తించడం అంత సులభమేమీ కాదు. ఎన్నో అంశాలు మనకు బాధను, ఆందోళనను కలిగిస్తాయి. చాలాసార్లు మనం వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. నా వరకూ, ఓ మాతృమూర్తిగా, నా కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండటం తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. కానీ గత సంవత్సరంన్నర కాలంగా నేను తెలుసుకున్న అంశమేమిటంటే, చాలా అంశాలు నా నియంత్రణలో ఉండవు,కానీ నా కుటుంబ ఆరోగ్యం మాత్రం నా నియంత్రణలోనే ఉంటుంది. నా కుటుంబ ఆరోగ్య ప్రణాళికలలో భాగంగా మేము ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను తింటుంటాం. ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన స్నాక్‌గా బాదములు నిలుస్తాయి. వీటిని నేరుగా లేదా ఓట్స్‌, షేక్స్‌, స్మూతీలతో కలుపుకుని కూడా తినవచ్చు. తరచుగా వీటిని తినడం వల్ల నేను శక్తివంతం కావడము కాదు, వాటిని తింటున్న నా కుటుంబ రోగ నిరోధక శక్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. బాదములలో రాగి, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ వంటివి అధికంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా ఎదుగుదల, రోగ నిరోధక శక్తి అభివృదిఽ్ధ , నిర్వహణ, సాధారణంగా పనిచేసేందుకు తోడ్పడతాయి’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తరచి చూస్తే, చాలా మారింది. దానితో పాటుగా మనం కూడా చాలా మారాము. ఈ కష్టకాలంలో మనం ముందుకు చేరాలంటే, గతం నుంచి మనం నేర్చుకోవడంతో పాటుగా చక్కగా కోలుకునేందుకు తగిన మార్గాన్ని ఏర్పరుచుకుని పాత అలవాట్లు మార్చుకోవడంతో పాటుగా నూతన, మెరుగైన అలవాట్లను చేసుకోవడం చేయాలి. దీనికోసం, కుటుంబాలకు నేనిచ్చే అతి ప్రధానమైన సలహా ముందుగా గృహంలో ప్యాంట్రీని సమూలంగా మార్చుకోవాలి. అనారోగ్యకరమైన, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని పోషకాలతో కూడిన అవకాశాలు అయినటువంటి బాదములు లేదా తాజా పళ్లతో పూరించాలి.

స్నాకింగ్‌ విధానంలో ఈ మార్పులు కుటుంబ సభ్యుల నడుమ మెరుగైన గుండె  ఆరోగ్యానికి తోడ్పాటునందిస్తాయి. వాస్తవానికి , అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ఎవరైతే తమ అనారోగ్యకరమైన ఆహారంకు బదులుగా బాదములు తీసుకుంటారో, వారిలో హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ మానసిక  ఒత్తిడి సమయంలో సైతం మెరుగ్గా ఉంటుంది. కార్డియాక్‌ ఆరోగ్యం, పనితీరు వేళ ఇది అత్యంత కీలకం’’ అని అన్నారు.

Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world
Experts deliberate on the challenges Indians need to surmount to achieve optimal family health in a post pandemic world

అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా, గ్లోబల్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ – వీపీ ఎమిలీ ఫ్లీష్మాన్‌ మాట్లాడుతూ  ‘‘మహమ్మారి అనంతర ప్రపంచంలో  చక్కటి పౌష్టికాహారం,ఆరోగ్యవంతమైన జీవనశైలి అత్యంత కీలకంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా,  మహమ్మారి సమయంలో కూడా,మేము ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలలో మెరుగైన అవగాహన కల్పించడానికి ప్రయత్నించాము.మరీముఖ్యంగా భారతదేశంలో,  పౌష్టికాహార,సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తరచుగా వ్యాయామాలు చేయడం గురించి కూడా అవగాహన కల్పించాం. ఏబీసీ స్థిరంగా శాస్త్రీయ పరిశోధనలు చేయడంతో పాటుగా బాదములను ఆరోగ్యవంతమైన పౌష్టికాహార విధానంలో జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తిస్తుంది. నిత్యం మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా మారడానికి మనం మన ప్రయత్నాలను కొనసాగిస్తున్న వేళ, తమ సొంత, కుటుంబసభ్యుల ఆహార ప్రక్రియలు, జీవనశైలిని సమీక్షించుకోవడంతో పాటుగా అత్యుత్తమ భవిష్యత్‌కు తోడ్పడే మార్పులను స్వీకరించాల్సి ఉంది’’ అని అన్నారు.

Almond Board of California Virtual Discussion Program on Lifestyle
Almond Board of California Virtual Discussion Program on Lifestyle

భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా , చిన్నవే అయినప్పటికీ అతి ముఖ్యమైన రీతిలో ఆహార అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలి పరంగా తమ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అపారమైన ప్రయోజనాలను పొందగలం. ఈ మార్పులను అతి సులభంగా చేసుకునేందుకు ఓ గుప్పెడు బాదములను డైట్‌లో జోడించుకోండి. ఇవి మీ గుండె ఆరోగ్యం కాపాడటంతో పాటుగా ఆరోగ్యవంతమైన షుగర్‌ లెవల్స్‌ నిర్వహించడానికి, వ్యక్తి బరువు నియంత్రణలో ఉంచడానికి లేదా చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికీ తోడ్పడుతుంది. ప్రతి రోజూ బాదములు తీసుకోవడమనేది ఖచ్చితంగా కుటుంబ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వాస్తవానికి, ఆరోగ్యవంతమైన, అనుకూలమైన జీవనశైలిలో భాగంగా ప్రతి రోజూ బాదములు తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడటంతో పాటుగా భవిష్యత్‌లో ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండానూ కాపాడుతుంది.