Tue. Oct 3rd, 2023
Alphabet

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 25, 2022: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు బిగ్ టెక్ సంస్థలు తొలగింపుల సీజన్‌ మొదలైంది. గూగుల్ మాతృ సంస్థ Alphabet సుమారు 10,000 మంది ఉద్యోగులను అంటే 6 శాతం మందిని తొలగించడానికి సిద్ధమ వుతున్నట్లు వెల్లడించింది. ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, కొత్త ర్యాంకింగ్, పనితీరు మెరుగుదల ప్రణాళిక ద్వారా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని Google యోచిస్తోంది.

Alphabet

“కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ వచ్చే ఏడాది ప్రారంభంలో పనితీరు సరిగాలేని వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమవుతోంది. వారికి బోనస్‌లు, స్టాక్ గ్రాంట్లు చెల్లించకుండా ఉండటానికి మేనేజర్‌లు రేటింగ్‌లను కూడా ఇస్తున్నారు. కొత్త విధానంలో నిర్వాహకులు 6 శాతం మంది ఉద్యోగులను లేదా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తగ్గించ నున్నట్లు సమాచారం.