365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, అక్టోబర్ 6 ,2020:Amazon.in తమ పండుగ కార్యక్రమం, ‘ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ని 2020, అక్టోబర్ 17న ప్రారంభిస్తున్నట్లుగా ఈరోజు ప్రకటించింది. ప్రైమ్ సభ్యులకు 2020 అక్టోబర్ 16 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది, లక్షలాదిమంది స్మాల్ &బిజినెసెస్ (ఎస్ఎంబీలు) క్లిష్టమైన సమయంలో తమ వ్యాపారాన్ని పునర్నిర్మించి,పెంచడంలో తమకు సహాయపడటానికి కస్టమర్లకు విలక్షణమైన ఎంపికను అందిస్తున్నారు. స్థానిక దుకాణాలు, అమేజాన్ లాంచ్ ప్యాడ్, అమేజాన్ సహేలి,అమేజాన్ కారిగరండ్ వంటి వివిధ కార్యక్రమాలు ద్వారా వేలాదిమంది అమేజాన్ విక్రయదారులు నుండి విలక్షణమైన ఉత్పత్తులు షాప్ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు అవకాశం పొందుతారు. లక్షలాది చిన్న వ్యాపారాలు అందించే డీల్స్/ఆఫర్లు ఆనందించండి.అమేజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారి ప్రకటన పై వ్యాఖ్యానిస్తూ,“దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కస్టమర్లను చేరడానికి ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మన విక్రయదార్లు, భాగస్వాములకు ఒక అవకాశం. తమ వ్యాపారాన్ని పెంచడానికి ఇది తోడ్పడుతుందని మన విక్రయదారులు ఆశిస్తూ ఉత్సాహపడుతున్నారు. పండుగ సమయంలో వారికి అవసరమైన ప్రతీది వారు కనుగొనడంలో వారికి సహాయం చేయడం,వారికి సురక్షితంగా అందచేయడం మన కస్టమర్ల కోసం, మన లక్ష్యం.”ఈ పండుగ సీజన్ గురించి అమేజాన్. ఇన్ లో విక్రయదారులు ఎంతో ఆశావాహకంగా ఉన్నారు. నీల్సన్ చేసిన సర్వే ప్రకారం, అమేజాన్.ఇన్ పై 85% కంటే ఎక్కువమంది విక్రయదారులు కొత్త కస్టమర్లని చేరడాన్ని ఆశిస్తున్నారు,అమ్మకాల్లో పెంపుదలను చూసారు. 74%కి పైగా విక్రయదారులు తమ వ్యాపారం కోలుకోవడం గురించి ఆశావాహకంగా ఉన్నారు,ఉత్పత్తులు కనిపించడంలో పెంపుదల గురించి 78% మంది ఆశావాహకంగా ఉన్నారు.
స్మాల్ &మీడియం వ్యాపారాలుతో త్వరగా సంబరం చేసుకోండి
వందలాది ఎస్ఎంబీ డీల్స్ నుండి షాపింగ్ చేయడం ద్వారా కస్టమర్లు ఈ వ్యాపారాలకు మద్దతు ఇవ్వవచ్చు, సేల్ (ఐఎన్ఆర్ 100* వరకు 10% క్యాష్ బ్యాక్) సమయంలో రెడీమ్ చేసుకోగలిగే బహుమతులతో వారు భారీగా ఆదా చేయవచ్చు. కస్టమర్లు ఒడిషా నుండి సంబాల్ పురి చీరలు, ఐలైఫ్ నుండి రోబోటిక్ వేక్యూమ్ క్లీనర్స్, అరట బ్యూటీ నుండి హెయిర్ కేర్ ఉత్పత్తులు, డైలీ ఆబ్జెక్ట్స్ నుండి స్లింగ్ బ్యాగ్స్ &క్రాస్-బాడీ బ్యాగ్స్, కిల్క్ ఫిట్ నుండి వ్యాయామం చేయడానికి ఉపయోగించే బైక్స్ &డంబెల్స్, ఆగ్రా నుండి చేతితో చేసిన బూట్లు, ఇన్ స్లీప్ నుండి మెమోరి ఫోమ్ మ్యాట్రెసెస్, స్వర క్రియేషన్స్ నుండి జ్యూయలరి, స్టిచ్ నెస్ట్ నుండి కుషన్ కవర్స్, కుషల్ కే నుండి కుర్తీ సెట్స్, డాక్టర్ వైద్య న్యూ ఏజ్ ఆయుర్వేదం నుండి హెల్త్ &వెల్ నెస్ ఉత్పత్తులు ఉగావో నుండి సహజమైన మొక్కలు,కుండీలు మరియు ఇంకా ఎన్నో ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవచ్చు.
కొత్త ప్రారంభాలు మరియు పండుగ ప్రత్యేకతలు
ప్రముఖ బ్రాండ్లుయైన శామ్ సంగ్, వన్ ప్లస్, యాపిల్, బోట్, జేబీఎల్, సోనీ, సెన్నెహీజర్, డాబర్, ఎల్జీ, ఐఎఫ్ బీ, హైసెన్స్, టైటాన్ మ్యాక్స్ ఫ్యాషన్, బిబా, స్పైకర్, పనసోనిక్, యురేక ఫోర్బ్స్, వోషర్, లాక్మే, బిగ్ మజిల్స్, కాస్మిక్ బైట్, మ్యాగీ, టైడ్ రియల్ మీ, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్, వెస్ట్ ల్యాండ్, హార్పర్, గ్జియోమి, అప్పో, సాన్యో, గోప్రో, హోనర్, బాష్, అమేజ్ ఫిట్, పీటర్ ఇంగ్లండ్, లెవీస్, రివర్, అమేజాన్ బేసిక్స్, యుఆర్ బీఎన్, బయోటిక్, పాన్ మెక్ మిలన్, కార్మేట్, బైక్ బ్లేజర్,ఇంకా ఎన్నో బ్రాండ్లు నుండి 900కి పైగా కొత్త ఉత్పత్తి ప్రారంభోత్సవాలు లభిస్తాయి. సరికొత్త అమేజాన్ ఇకో డాట్, ఇకో డాట్ విత్ క్లాక్, అమేజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్ , అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ తో ఫైర్ టీవీ స్టిక్ లైట్తో సహా అమేజాన్ డివైజెస్ నుండి కొత్త ఆరంభాలు.
ప్రతీ తరగతిలో డీల్స్, ప్రతీరోజూ కొత్త డీల్స్
ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, ఫర్నిచర్, హెడ్ ఫోన్స్ మొదలైనటువంటి పని/చదువు /ఇంట్లో ఉండటం వంటి ఉత్పత్తులతో సహా వివిధ తరగతుల్లో అతి పెద్ద బ్రాండ్లు నుండి ప్రతీరోజూ విక్రయదారులు ప్రకటించడం నుండి కొత్త డీల్స్ తో అంతులేని ఉద్వేగాన్ని కస్టమర్లు అనుభవించవచ్చు. కస్టమర్లు పెద్ద ఉపకరణాలైన ఎయిర్ ప్యూరిఫైర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్స్, ఇంకా ఎన్నో ఉపకరణాల్ని తమ ఇంటి నుండి సౌకర్యవంతంగా షాప్ చేయవచ్చు. వారు అప్పారెల్, ఫ్యాషన్ యాక్ససరీస్ , సౌందర్య ఉత్పత్తులు వంటి విస్త్రతమైన శ్రేణి నుండి ఎంచుకోవచ్చు.
అమేజాన్ బిజినెస్ పై బిజినెస్ బయ్యర్లు కోసం భారీ డిస్కౌంట్లు మరియు ఆదాలు
ప్రముఖ బ్రాండ్లు హెచ్ పీ, లెనోవో, కానన్ , గోద్రేజ్ , జీబీసీ, స్టాక్, కాసియో, యురేకా ఫోర్బ్స్ వంటి తరగతులు నుండి వాణిజ్య ఉత్పత్తులు ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, నెట్ వర్కింగ్ డివైజ్ లు, డిస్ ఇన్ఫెక్టింగ్ డివైజ్ లు, డీప్ ఫ్రీజర్లు, ఆఫీస్ ఎలక్ట్రానిక్స్, వేక్యూమ్ క్లీనర్స్, మిక్సర్ గ్రైండర్స్ భారీ డిస్కౌంట్లు, ప్రత్యేకమైన డీల్స్ , తక్కువ పండుగ ధరల ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్, బహుమతులు ,ఇంకా ఎన్నో వాటితో బిజినెస్ బయ్యర్లు అమేజాన్ బిజినెస్ పై భారీగా ఆదా చేయవచ్చు. అన్నీ లావాదేవీలకు జీఎస్టీ ఇన్ వాయిస్ సహాయం లభిస్తుంది. క్లైంట్లు, కస్టమర్లు, ఉద్యోగులు కోసం తమ బహుమతి అవసరాల్ని తీర్చడానికి ఎస్ ఎంబీ నుండి వ్యాపారాలు కూడా కొనుగోలు చేయవచ్చు. వారు వర్క్ ఫ్రం హోం, భద్రత/పరిశుభ్రత మరియు దూర విద్యకు కావల్సినవి కూడా ఎంచుకోవచ్చు.
తక్కువ ధరలకే షాపింగ్
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డ్స్ పై 10% తక్షణ బ్యాంక్ డిస్కౌంట్,ఈఎంఐ లావాదేవీలు, డెబిట్,క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎం,బజాజ్ ఫిన్ సర్వ్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు, ఇతర ప్రముఖ క్రెడిట్ /డెబిట్ కార్డ్స్,ఇంకా ఎన్నో వాటి నుండి ఉత్తేజభరితమైన ఆఫర్లు నుండి కస్టమర్లు విస్త్రతమైన శ్రేణిలో తక్కువ ధరలకు ఫైనాన్స్ ఎంపికల్ని చూడవచ్చు. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో ఐఎన్ఆర్ 10,000 విలువ గల షాపింగ్ బహుమతుల్ని కస్టమర్లు రోజూ గెలుపొందవచ్చు ,అమేజాన్ పే ద్వారా బహుమతులు, షగూన్ డబ్బు పంపించవచ్చు.
కస్టమర్లు కోసం మరిన్ని
•షాప్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి,వాయిస్ తో డీల్స్ గుర్తించడానికి మరిన్ని విధానాలు – తమ ఉత్పత్తులు, అలెక్సా -ప్రత్యేకమైన డీల్స్ తో సహా ప్రముఖ డీల్స్ వేగంగా అన్వేషించడానికి , యుటిలిటి బిల్లులు చెల్లించడానికి, అమేజాన్ పేలో డబ్బు వేయడానికి లేదా స్మాల్ బిజినెస్ స్టోర్, ఫన్ జోన్ లేదా గ్రేట్ ఇండియన్ బజార్ ని నేవిగేట్ చేయడానికి కస్టమర్లు ఇప్పుడు వాయిస్ ని ఉపయోగించవచ్చు లేదా అలెక్సాని తమ అమేజాన్ షాపింగ్ యాప్ పై (ఆండ్రాయిడ్ మాత్రమే) అడగవచ్చు.
•షాప్ చేయడానికి మరిన్ని కారణాలు – వివిధ సందర్భాలు కోసం కస్టమర్లు ఉత్పత్తుల్ని షాప్ చేయవచ్చు. నవరాత్రి మరియు పూజ స్టోర్స్ పండుగల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఉత్పత్తుల్ని చూపిస్తుంది. కస్టమర్లు ‘క్రికెట్ టి-20 ఎక్స్ పీరియెన్స్’స్టోర్ నుండి షాప్ చేయవచ్చు ,తాము అభిమానించే జట్లకు చీర్ చెప్పవచ్చు. వివాహ సీజన్ రానున్న నేపధ్యంలో, వెడ్డింగ్ స్టోర్ జీవితంలో అతి పెద్ద సందర్భాన్ని అదే విధంగా సంబరం చేసుకోవడాన్ని నిర్థారించడానికి విస్త్రతమైన ఉత్పత్తుల శ్రేణిని అందిస్తోంది. థన్ తేరాస్ స్టోర్ బంగారం నాణేలు, పాత్రలు,దీపావళి ఇంటి అలంకరణ పై గొప్ప డీల్స్ అందిస్తోంది.
•బహుమతి ఇవ్వడానికి మరిన్ని కారణాలు- ఈ పండుగ సమయం భిన్నమైనది ,నవీకరించబడిన గిఫ్టింగ్ స్టోర్ నుండి వ్యక్తిగత సందేశాలతో సహా గిఫ్ట్ ర్యాప్ చేయబడిన ఉత్పత్తుల్ని కస్టమర్లు తమ వారి కోసం బహుమతులు పంపించడానికి అమేజాన్ ఈ పండుగ సమయాన్ని మరింత సరళంగా,మరింత ఆనందకరంగా చేసింది.
కస్టమర్ డిమాండ్ ని తీర్చడానికి నమ్మకం రూపొందించడం:
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో సురక్షితమైన, నమ్మకమైన డెలివరీలు నిర్థారించడానికి,కస్టమర్ డిమాండ్ తీర్చడానికి, అమేజాన్ తమ డెలివరీ మౌలిక సదుపాయాన్ని సుమారు 200 డెలివరీ స్టేషన్స్ కి చేర్చింది,తమ నెట్ వర్క్ కి పదులు, వందలు డెలివరీ భాగస్వాముల్ని చేర్చింది. దేశంలో దూర ప్రాంతాల్లో నివసించే కస్టమర్లకు సేవలు అందించడానికి 32 మిలియన్ క్యూబిక్ అడుగులకు పైగా భద్రపరిచే సామర్థ్యాన్ని అందించే 15 రాష్ట్రాల్లో 60కి పైగా ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలతో అమేజాన్.ఇన్ తమ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాల సంఖ్యని విస్తరించింది. ఇంకా, దేశవ్యాప్తంగా ఫుల్ ఫిల్మెంట్ సామర్థ్యాన్ని శక్తివంతం చేయడానికి అమేజాన్ ఇండియా 5 కొత్త సార్ట్ సెంటర్లని,ప్రస్తుతమున్న 8 సార్ట్ సెంటర్ల విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో ఉత్తేజభరితమైన డీల్స్, ఆఫర్లు గురించి ఇక్కడక్లిక్ చేయండి.