365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 19,2024: అమెజాన్ పండుగ సీజన్‌లో భారత వినియోగదారులకు భారీ ఆఫర్లు అందిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతోంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఫోన్‌లు ఏ ధరకు లభిస్తున్నాయో తెలుసుకుందాం.
OnePlus 11R 5G: అమెజాన్‌లో OnePlus 11R 5G మోడల్ భారీ తగ్గింపుతో రూ. 26,749కి లభిస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, 100W SuperVOOC ఛార్జింగ్, 120Hz ఫ్లూయిడ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
Xiaomi 14: స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్, 50MP లైకా ట్రిపుల్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లతో Xiaomi 14 రూ. 47,999కి అందుబాటులో ఉంది.
iQOO Z9 Lite 5G: ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 9,499కి లభిస్తుంది. MediaTek Dimension 6300 5G ప్రాసెసర్, 50MP AI కెమెరా వంటి ఫీచర్లతో iQOO Z9 Lite 5G వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
iQOO Z7 Pro 5G: అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 19,749కి లభిస్తోంది. 3D కర్వ్డ్ 120Hz AMOLED డిస్‌ప్లే, Dimensity 7200 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
OnePlus Nord CE 3 5G: ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 16,749కి లభిస్తోంది. 12GB RAM, 50MP సోనీ కెమెరా, 80W SuperVOOC ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Redmi 13C 5G: అమెజాన్ ఈ ఫోన్‌ను రూ. 9,199కి విక్రయిస్తోంది. 50MP AI డ్యూయల్ కెమెరా, 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Tecno Pova 6 Neo 5G: 108MP AI కెమెరా కలిగిన ఈ ఫోన్ రూ. 12,749కి అందుబాటులో ఉంది.
Samsung Galaxy S21 FE: అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 25,749కి అందుబాటులో ఉంది. ఇది 12MP అల్ట్రా-వైడ్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Lava Blaze 3 5G: ఈ ఫోన్ రూ. 9,899కి లభిస్తోంది. 50MP AI కెమెరా, MediaTek D6300 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
POCO X6 5G: ఈ ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. డాల్బీ విజన్, 64MP OIS కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.