Sat. Dec 14th, 2024
amazon
amazon india announces increase in storage capacity of its fulfilment network
amazon india announces increase in storage capacity of its fulfilment network

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,15 జూలై, 2021: అమెజాన్‌ ఇండియా భారతదేశంలో తమ ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు తగిన ప్రణాళికలను వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40% తమ నిల్వ సామర్థ్యం విస్తరించనుంది. ఈ విస్తరణతో, అమెజాన్‌ డాట్‌ ఇన్‌కు 43 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల నిల్వ సామర్థ్యం, భారతదేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలలో అందుబాటులోకి రావడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా 8.5 లక్షల మంది విక్రేతలకు మద్దతునందించనుంది. ఈ విస్తరణ, దేశంలో తమ పెట్టుబడులను భారీగా కొనసాగించాలనే అమెజాన్‌ఇండియా ప్రయత్నాలకు అనుగుణంగా ఉండటంతో పాటుగా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగాలనూ సృష్టించనుంది.

Amazon India announces increase in storage capacity of its fulfilment network
Amazon India announces increase in storage capacity of its fulfilment network

అమెజాన్‌ ఇండియా మొత్తం ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌ 10 మిలియన్‌ చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉంది. ఇది 125 ఫుట్‌బాల్‌ ఫీల్డ్స్‌ పరిమాణాన్ని సైతం మించడంతో పాటుగా పుస్తకాల నుంచి డిష్‌ వాషర్ల వరకూ లక్షలాది వస్తువులు ఇక్కడ భద్రపరుస్తారు.
ఈ విస్తరణతో, అమెజాన్‌ ఇండియాకు దేశవ్యాప్తంగా 60కు పైగా ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు,నిత్యావసరాలు, కిరాణా కోసం అంకితం చేయబడిన అమెజాన్‌ ఫ్రెష్‌ కోసం 25కు పైగా స్పెషలైజ్డ్‌ కేంద్రాలు ఉన్నట్లయింది. నూతనంగా ఏర్పాటుచేయబడిన ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్ర, బీహార్‌, గుజరాత్‌, అస్సాం, రాజస్తాన్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు ,కర్నాటకలలో ఉంటాయి. వీటిని మృదువైన, వేగవంతమైన, మరింత స్థిరమైన అనుభవాలను తమ వినియోగదారులు, విక్రేతలకు దేశవ్యాప్తంగా అందించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ నూతన ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలలో కొన్ని ప్రైమ్‌ డే కన్నా ముందుగానే సిద్ధం కానున్నాయి మరియు పండుగ సీజన్‌కు ముందుగానే కార్యక్రమాల నిర్వహణనుకూడా చేపట్టనున్నాయి. తద్వారా వినియోగదారులు తాము కోరుకున్న వస్తువులను తమ ఇంటి ముంగిటనే డెలివరీ పొందగలరు.

amazon india announces increase in storage capacity of its fulfilment network
amazon india announces increase in storage capacity of its fulfilment network

అమెజాన్‌ ఇండియా ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌ వ్యాప్తంగా బిల్డింగ్స్‌ను అత్యాధునిక సాంకేతికత ,సమర్థవంతమైన బిల్డింగ్‌ వ్యవస్థ చేత రూపకల్పన చేశారు. ఇవి అతి తక్కువగా విద్యుత్‌ వినియోగించుకుంటాయి. ఈ భవంతులలో ఆన్‌సైట్‌ మరియు ఆఫ్‌సైట్‌ సోలార్‌ ప్యానెల్స్‌ కలిగి ఉన్నాయి. ఇవి సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. అధికశాతం భవంతులను నెట్‌ వాటర్‌ జీరో గా రూపకల్పన చేశారు. ​దీనికోసం పలు భవంతులలో బహుళ కార్యక్రమాలైనటువంటి వర్షపు నీటి సేకరణ ట్యాంకులు, ఆక్విఫయర్లలో నీటిని పూరించేందుకు రీచార్జ్‌ వెల్స్‌ , మురుగు శుద్ధి కర్మాగారాలు, అతి తక్కువ నీటిని వినియోగించుకునేలా సమర్థవంతమైన అమరికలు ఏర్పాటుచేశారు. కార్యక్షేత్రాలను మరింత సమ్మిళితంగా మార్చాలనే ప్రయత్నాలను కొనసాగిస్తూ ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను దివ్యాంగులు సైతం సౌకర్యవంతంగా పనిచేసేలా రూపకల్పన చేశారు.


అఖిల్‌ సక్సేనా, వీపీ, కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఆపరేషన్స్‌, ఏపీఏసీ, మెనా , లాటమ్‌, అమెజాన్‌ మాట్లాడుతూ ‘‘ భారతదేశ వ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు , వినియోగదారులకు సేవలనందించడంతో పాటుగా తగినశక్తిని సైతం అందించాలనే మా వాగ్ధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మా ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌ విస్తరణ చేశాం. వృద్ధి చేయబడిన నిల్వసామర్థ్యం 43 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లతో, మేము స్థిరంగా మా వినియోగదారుల వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చగలం. అదే సమయంలో విస్తృత స్ధాయి ఎంపిక మరియు వేగవంతమైన డెలివరీతో అత్యుత్తమ అనుభవాలను సైతం అందించనున్నాం. ఈ విస్తరణ ఇప్పుడు అనుబంధ వ్యాపారాలకు సైతం మద్దతునందిస్తుంది.

Amazon India announces increase in storage capacity of its fulfilment network
Amazon India announces increase in storage capacity of its fulfilment network

​వీటిలో ప్యాకేజింగ్‌, లాజిస్టిక్స్‌, రవాణా వంటి సేవల పరంగా మద్దతునందించడం ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా అర్థవంతమైన పని అవకాశాలనూ సృష్టిస్తుంది’’ అని అన్నారు. అమితాబ్‌ కాంత్‌, సీఈవో, నీతి ఆయోగ్‌ మాట్లాడుతూ ‘‘మహమ్మారి కాలమంతటా కూడా ఈ-కామర్స్‌ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తూ ప్రజలకు, చిరు వ్యాపారాలకు మద్దతునందించడంతో పాటుగా వేలాది స్ధానిక ఉద్యోగావకాశాలనూ కల్పించింది. భారతదేశ వ్యాప్తంగా లక్ష్యిత రీతిలో అమెజాన్‌ పెట్టుబడులు పెడుతుండటం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీటిద్వారా వారు తమ అత్యాధునిక మౌలిక వసతులను నిర్మించుకోవడంతో పాటుగా వ్యాప్తి చేయడమూ చేస్తున్నారు. ఇది కోవిడ్‌–19 మహమ్మారి చేత ఆర్ధికంగా ప్రభావితమైన ఎంఎస్‌ఎంఈలు వేగవంతంగా తమ కార్యకలాపాలు ఆరంభించేందుకు మద్దతునందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించడంతో పాటుగా డిజిటల్‌ వ్యాపారవేత్తలుగా వారి ప్రయాణం వేగవంతం చేయడంలోనూ తోడ్పడుతుంది. భవిష్యత్‌ అంతా డిజిటల్‌గానే ఉంటుంది మరియు మన ఎంఎస్‌ఎంఈలు ఖచ్చితంగా ఈ వృద్ధికి చోధకులుగా నిలుస్తారు. శక్తివంతమైన, స్థిరమైన, డిజిటల్‌ ఇండియా నిర్మాణ దిశగా కట్టుబడిన భారతీయ ఎంఎస్‌ఎంఈలందరితో పాటుగా అమెజాన్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను..’’ అని అన్నారు.

భారతదేశంలో అత్యాధునికమైన ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌,విక్రేతలను అమెజాన్‌ ఇండియా సృష్టించింది. ఫుల్‌ఫిల్‌మెంట్‌, ఆధారపడతగిన దేశవ్యాప్త డెలివరీ, వినియోగదారుల సేవలలో అమెజాన్‌ నైపుణ్యం నుంచి వీరు ప్రయోజనం పొందుతారు. ఫుల్‌ఫిల్‌మెంట్‌ బై అమెజాన్‌ (ఎఫ్‌బీఏ)ను వినియోగించినప్పుడు, భారతదేశవ్యాప్తంగా విక్రేతలు తమ ఉత్పత్తులను అమెజాన్‌ ఎఫ్‌సీలకు పంపుతారు. ఒకసారి ఆర్డర్‌ను అందించగానే , వినియోగదారుల కోసం అమెజాన్‌ వాటిని ఎంచడం, ప్యాక్‌ చేయడం, రవాణా చేయడంను చేస్తుంది. అంతేకాదు విక్రేతల తరపున వినియోగదారుల సేవలు అందించడంతో పాటుగా రిటర్న్స్‌ సైతం నిర్వహిస్తుంది.

అమెజాన్‌ ఇండియా అసాధారణ విలువ, దృష్టిని తమ ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌ వ్యాప్తంగా తమ ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం అందిస్తుంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ కోవిడ్‌-19తో సంబంధితమైన సవాళ్లనుఎదుర్కొంటూనే ఉన్నారు. ఇటీవలనే, ఈ కంపెనీ తమ అసోసియేట్లు, ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన వారి కోసం1,30,000 కు పైగా టీకాలను పలు నగరాలలో సుప్రసిద్ధ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో భాగస్వామ్యం చేసుకుని నిర్వహించిన తమ టీకా కార్యక్రమాల ద్వారా అందించింది.


అమెజాన్‌ మొబైల్‌ షాపింగ్‌ యాప్‌తో పాటుగా www.amazon.in పై ఉన్న వినియోగదారులందరూ కూడా అతి సులభమైన, సౌకర్యవంతంగా 200 మిలియన్‌లకు పైగా ఉత్పత్తులను వందలాది విభాగాలలో పొందగలరు. వారు అత్యంత సురక్షితమైన, భద్రతతో కూడిన ఆర్డరింగ్‌ అనుభవాలను అందుకోవడంతో పాటుగా సౌకర్యవంతమైన చెల్లింపులు, క్యాష్‌ ఆన్‌ డెలివరీ, అమెజాన్‌ 24 గంటల వినియోగదారుల సేవా మద్దతు అంతర్జాతీయంగా గుర్తించబడిన, సమగ్రమైన 100% కొనుగోలు భద్రతను అమెజాన్‌ ఏ-జెడ్‌ గ్యారెంటీతో అందించడం వల్ల ప్రయోజనం పొందగలరు. వారు అమెజాన్‌ డాట్‌ ఇన్‌ గ్యారెంటీడ్‌ నెక్ట్స్‌ డే డెలివరీ, రెండు రోజుల డెలివరీ ,స్టాండర్డ్‌ డెలివరీని అమెజాన్‌ ఫుల్‌ఫిల్డ్‌ ఉత్పత్తులపై పొందవచ్చు.

error: Content is protected !!