365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 30జూన్ 2021: అమెజాన్ ఇండియా తమ ప్రైమ్ సభ్యులందరికీ ‘అమెజాన్ డే డెలివరీ’ను ప్రారంభించింది. ఊహించతగిన, సౌకర్యవంతమైన డెలివరీ ప్రయోజనం అందించే కార్యక్రమం అమెజాన్ డే డెలివరీ. ఇది ప్రైమ్ సభ్యులకు తాము వారంలో కొనుగోలు చేసిన వస్తువులన్నీ కూడా తాము సూచించిన రోజునే డెలివరీ అందించేందుకు అవకాశం కల్పించే కార్యక్రమమిది. వినియోగదారులు సౌకర్యవంతంగా ప్రైమ్ ఫాస్ట్, ఉచిత షిప్పింగ్, అమెజాన్ డే డెలివరీ వంటి వాటిని చెకవుట్ సమయంలో ఎంచుకోవచ్చు.
‘అమెజాన్ డే’ ఇప్పుడు కొనుగోళ్లను ఏకమొత్తంలో చేయడంతో పాటుగా ఒకేసారి డెలివరీ చేయడం వల్ల వినియోగదారులు ఉన్న ప్రాంతానికి అతి కొద్ది ట్రిప్స్‌లోనే చేరుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడమూ వీలవుతుంది. అమెజాన్ షిప్‌మెంట్స్‌ను నెట్ జీరో కార్బన్‌గా మలచాలనే కంపెనీ యొక్క అంతర్జాతీయ లక్ష్యానికనుగుణంగా ప్రారంభించిన అమెజాన్ యొక్క ఎన్నో సస్టెయినబిలిటీ కార్యక్రమాలలో ఈ డెలివరీ అవకాశం కూడా ఒకటి. 2030 నాటికి 50% పైగా షిప్‌మెంట్స్‌ను నెట్‌జీరో గా మార్చాలన్నది కంపెనీ లక్ష్యం.
అమెజాన్ డే గురించి అక్షయ్ సాహీ, డైరెక్టర్, ప్రైమ్ అండ్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్, అమెజాన్ ఇండియా మాట్లాడుతూ ‘‘ప్రైమ్ సభ్యుల కోసం సుస్ధిర పర్యావరణ అనుకూల షిప్పింగ్ అవకాశాలను అందించాలనే నేపథ్యంతో వినియోగదారుల కోసం మేము ఏ విధంగా పనిచేస్తామనేదానికి ఓ ఉదాహరణగా అమెజాన్ డే డెలివరీ నిలుస్తుంది. అమెజాన్ డే డెలివరీతో, భారతదేశంలోని సభ్యులు తమ డెలివరీలను తమ వ్యక్తిగత వారపు షెడ్యూల్స్‌కు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవడంతో పాటుగా అతి సులభంగా తమ ఆర్డర్లు ప్రతి వారం అదే రోజు సురక్షితంగా వస్తామనే నమ్మకంతో ఉండవచ్చు. ఇప్పటికే ప్రైమ్ సభ్యులు ఆస్వాదిస్తున్న అన్‌లిమిటెడ్ ఫాస్ట్,ఫాస్ట్ డెలివరీ ప్రయోజనాలతో పాటుగా ఈ సేవలు లభ్యమవుతాయి. అమెజాన్ డే డెలివరీ బీటా వెర్షన్‌ను భారతదేశంలో ఒక మిలియన్‌కు పైగా ప్రైమ్ సభ్యులు స్వీకరించడం మేము చూశాం. తద్వారా షిప్పింగ్ పరంగా వేలాది బాక్సులను వారు కాపాడారు. దేశవ్యాప్తంగా ప్రైమ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అభిమానిస్తారని ఆశిస్తున్నాము మరియు డెలివరీలను కార్బన్ న్యూట్రల్‌గా మార్చడం ద్వారా షిప్‌మెంట్ జీరో కు తోడ్పాటునందించగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారు నీతి మాట్లాడుతూ ‘‘చాలా వరకూ నా కొనుగోళ్లకు నేను అమెజాన్ వినియోగిస్తుంటాను. వారంలోనే చాలా ఆర్డర్లు చేస్తుంటాను. అది మా పాప కోసం పులప్స్ లేదంటే మా పెద్ద పాప ఆర్ట్ క్లాస్ కోసం మెటీరియల్స్ లేదంటే పార్టీకి వెళ్లడానికి నాకు ఇయర్ రింగ్స్ కోసం కూడా కావొచ్చు. ఈ ఐటెమ్స్ ఎప్పుడు వస్తాయో ట్రాకింగ్ చేయడంతో పాటుగా పలుమార్లు డెలివరీలను చేయడం ఒక్కోసారి సవాల్‌గా నిలుస్తుంటుంది. ఎందుకంటే నేను ఒక్కోసారి ఇంటిలో ఉండకపోవచ్చు. కానీ చివరి సారి, నేను వీక్ ద్వారా ఆర్డర్ చేశాను. అవన్నీ కూడా సోమవారం నాకు వచ్చాయి. మై అమెజాన్ డే అంతా కూడా ఒకే బాక్స్‌లో వచ్చింది !’’ అని అన్నారు.
ప్రైమ్ సభ్యులు చెకవుట్ సమయంలో అమెజాన్ డే డెలివరీ అవకాశం కోసం చూడవచ్చు మరియు తమకు అత్యంత అనుకూలమైన రోజును ఎంచుకోవచ్చు. అంతేకాదు, తమ అమెజాన్ డే ను ఏ సమయంలో అయినా మరో రోజుకు మార్చుకోవచ్చు. వినియోగదారులు ఆ తరువాత వారమంతా కూడా ఆర్డర్ చేయవచ్చు మరియు తమ వస్తువులను పూర్తి ఉచితంగా తాము ఎంచుకున్న రోజున డెలివరీ పొందవచ్చు.వినియోగదారుల జీవితాలను సౌకర్యవంతంగా మలిచేందుకు మరియుప్రతి రోజూ మరింత వినోదాత్మకంగామలిచేందుకు ప్రైమ్‌ను డిజైన్‌చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్‌లకు పైగా ప్రైమ్ సభ్యులు ప్రైమ్ ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు.
భారతదేశంలో, అపరిమిత ఉచిత షిప్పింగ్,ఫాస్ట్ షిప్పింగ్, అవార్డులు గెలుచుకున్న సినిమాలు మరియు ప్రైవ్ వీడియోతో టీవీ షోలను అపరిమితంగా చూసే అవకాశం, 70 మిలియన్‌లకు పైగా పాటలకు అపపరిమిత యాక్సెస్, ప్రైమ్ మ్యూజిక్‌తో యాడ్ ఫ్రీ కంటెంట్, 1000కు పైగా పుస్తకాలు, మ్యాగజైన్లు మరియు కామిక్స్‌ను ప్రైమ్ రీడింగ్‌తో ఉచితంగా చదివే అవకాశం, ఉచితంగా గేమ్ కంటెంట్‌ను పొందే అవకాశం మరియు ప్రైమ్‌తో గేమింగ్ ప్రయోజనాలు, నూతన ఉత్పత్తి ఆవిష్కరణలు, లైటెనింగ్ డీల్స్‌ను ముందుగా పొందడం మరియు మరెన్నో ఉన్నాయి. అమెజాన్ డే గురించి మరింతగా తెలుసుకోవడంకోసం amazon.in/amazonday. చూడొచ్చు. ఇప్పటికీ ప్రైమ్ సభ్యులు కాని వినియోగదారులు తమ సభ్యత్వ నమోదు కోసం amazon.in/prime. చూడవచ్చు.